100-days-movie( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Telugu movies: థియేటర్లలో వందల రోజులు ఆడే సినిమాలు ఇప్పుడెందుకు ఆడటంలేదు.. రిజన్ ఇదే..

Telugu movies: ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ‘వందల రోజులు’, ‘రెండోందల రోజులు’ అనే పదాలు ఉండేవి. అప్పట్లో సినిమా వంద రోజులు సినిమా అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు కనీసం రెండు వారాలు సినిమా థయేటలర్లో ఆడితే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు దీనికి గల కారణం ఎందుకు ఇంత మార్పు జరిగింది. చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్‌ల సినిమాలు థియేటర్లలో నెలల తరబడి ప్రేక్షకులను ఆకట్టుకునేవి. కొన్ని సినిమాలు 175 రోజులు, 200 రోజులు కూడా ఆడి, రికార్డులు సృష్టించాయి. కానీ ఇప్పుడు? చాలా సినిమాలు 2-3 వారాల్లోనే థియేటర్ల నుంచి తప్పిపోతున్నాయి. ఈ మార్పు ఎందుకు? OTT ప్లాట్‌ఫామ్‌లు, పెరిగిన సినిమా విడుదలలు, ప్రేక్షకుల ఆసక్తి మార్పులు సినిమా ఇలా మారడానికి కారణం.

Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతున్న బడా నిర్మాత!.. దర్శకుడు ఎవరంటే?

1.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల బూమ్

ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లడమే మార్గం. కానీ 2010ల చివరి నుంచి ఓటీటీ సేవలు (అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, వంటివి) ప్రవేశించాయి. ఇప్పుడు సినిమా థియేటర్‌లో విడుదలైన 4-6 వారాల్లోనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రేక్షకులు థియేటర్‌కు రెండు, మూడుసార్లు వెళ్లే అవసరాన్ని తగ్గించింది. తెలుగు సినిమాల పరంగా చూస్తే, ‘పుష్ప’, ‘కల్కీ 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్లు కూడా ఓటీటీలో విడుదలైన తర్వాత థియేటర్ కలెక్షన్లు తగ్గాయి. ఒక వీడియో ఎస్సే ప్రకారం, OTTలు మెరుగైన కంటెంట్, సృజనాత్మక స్వేచ్ఛ, ఫిల్టర్ లేని ప్రదర్శనలు అందిస్తున్నాయి. అయితే మేకర్లకు చెల్లింపులు తక్కువగా ఉన్నప్పటికీ ఓటీటీలకు ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఫలితంగా, ప్రేక్షకులు ఇంటి నుంచే సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. భారతదేశంలో OTT సబ్‌స్క్రిప్షన్లు 2025 నాటికి 50 కోట్లకు చేరాయని అంచనా.

2. పెరిగిన సినిమాలు

ఒకప్పుడు సంవత్సరానికి 100-150 సినిమాలు మాత్రమే తెలుగులో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు? 200కి పైగా! పాన్-ఇండియా సినిమాలు, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, ఇతర భాషల సినిమాలు – అన్నీ ఒకే సమయంలో థియేటర్లను ఆక్రమిస్తున్నాయి. ఉదాహరణకు, 2024లో తెలుగులో 250కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. దీనివల్ల ప్రతి సినిమాకు థియేటర్ స్క్రీన్లు తక్కువగా లభిస్తున్నాయి. ఈ పోటీ వల్ల సినిమాలు త్వరగా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. ఒక నివేదిక ప్రకారం ఇతర భాషల సినిమాలు ప్రతి చోటా ప్రదర్శిస్తున్నాయి, దీనివల్ల స్థానిక సినిమాలకు స్థలం తగ్గుతోంది. మరోవైపు, మల్టిప్లెక్స్‌ల సంఖ్య పెరగడం (భారతదేశంలో 2025 నాటికి 15,000కి పైగా స్క్రీన్లు) ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవారిని విభజిస్తోంది. ఒకే ప్రాంతంలో 3-4 మల్టిప్లెక్స్‌లు ఉంటే, ప్రేక్షకులు ఆప్షన్లు ఎక్కువవుతాయి.

Read also-Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’లో దేవీ శ్రీ ప్రసాద్‌కు జోడీ ఎవరంటే?

3. టికెట్ ధరలు భారం

ఒకప్పుడు టికెట్ ధరలు 5-10 రూపాయలు. ఇప్పుడు? మల్టిప్లెక్స్‌లలో 200-400 రూపాయలు, వీకెండ్‌లలో మరింత ఎక్కువ! పాప్‌కార్న్, పెప్సీ వంటి స్నాక్స్‌కు 500-800 రూపాయలు ఖర్చు. పార్కింగ్, ఇంధనం, రవాణా ఖర్చులు కూడా జోడిస్తే, ఒక కుటుంబం సినిమాకు 2000-3000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది OTT సబ్‌స్క్రిప్షన్ (సంవత్సరానికి 1500 రూపాయలు) కంటే ఖరీదైనది. తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మధ్యతరగతి, ఈ ధరలు తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా, సినిమా ఒక్కసారి ఒక్కసారి మాత్రమే చూస్తున్నారు రెండో సారి చూడటానికి ఇష్టపడటంలేదు.

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్