Telangana politics: కవిత ఆరోపణలపై విచారణ చేయాలని కోరతాం
సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తా
సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయ్
2,600 పంచాయితీల్లో కాంగ్రెస్ విజయం
సీఎం పీఠం కోసమే కవిత ప్రయత్నాలు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ నేతలపై కవిత చేస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కోరతానని పీసీసీ చీఫ్ (TPCC) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడాారు. కవిత కొన్ని వాస్తవాలను బయట పెడుతుందని (Telangana politics) అన్నారు. ఆమెకు సీఎం కావాలనే కల ఉన్నదన్నారు. అయితే మనిషికి ఆశ ఉండాలని, అత్యాశ మాత్రం ఉండకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, సర్పంచులుగా గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్‌లో 4,230 పంచాయతీలకు గానూ కాంగ్రెస్ మద్దతుదారులు 2,600 పైచిలుకు స్థానాల్లో గెలిచారన్నారు. ఏకగ్రీవం అయిన చోట్ల 90 శాతం కాంగ్రెస్ మద్దతు దారుల గెలిచారన్నారు. చాలా చోట్ల బీజేపీ ,బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయన్నారు. వెయ్యికి దగ్గరగా బీఆర్‌ఎస్, 200 లోపు బీజేపీ, 40 స్థానాలు సీపీఎం, 30 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారన్నారు. రెండో విడత , మూడో విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
Read Also- Airfare Cap: విమాన టికెట్ ధరలపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పంచాయతీలో అత్యధిక స్థానాలు గెలవడం నిదర్శనంగా భావించాలన్నారు. ప్రజాపాలన మెచ్చి ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టారన్నారు. 15 మాసాల్లో 80 వేలకు పై ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని సంక్షేమాన్ని తెలంగాణలో ఇస్తున్నామన్నారు. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కి 25 వేలకు పైగా మెజార్టీ ప్రజలు ఇచ్చారన్నారు. అభివృద్ది,సంక్షేమం తో పాటు సామాజిక న్యాయం మెచ్చి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, స్థానిక నాయకులకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. తెలంగాణ వికాసం వైపు పయనిస్తోందన్నారు. గ్లోబల్ సమ్మిట్ తో ఊహించని విధంగా 5 లక్షల 75 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం ,విశ్వాసం పెరిగిందన్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
Read Also- KTR on Congress: కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. పల్లెల నుంచే ఆరంభం.. కేటీఆర్ సంచలన పోస్ట్
ఇక 14 లక్షల వరకు ఓట్ చోరీ సంతక సేకరణ జరిగిందని, ఈ నెల 14 వ తేదీన రామ్ లీలా మైదాన్ లో జరిగే మహాధర్నాలో సీఎం రేవంత్,కేబినెట్ మొత్తం ,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పీఏసీ సభ్యులు పాల్గొంటారన్నారు. మహా ధర్నాలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొనాలన్నారు.
ధర్నా రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి మెమొరెండం ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. ఓట్ చోరీ తోనే తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా.. బీజేపీ గెలిచింది ఎంత? అని గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వేసిన ఓట్లు ఎక్కడ పోయాయి? అని ప్రశ్నించారు. మరోవైపు ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరచారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు.

