Mahesh Kumar Goud: రాష్ట్రంలో ఫోర్త్ సిటీ అభివృద్ధి అయితే ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో పోటీ పడలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) తెలిపారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజన్ ఉందని, అందుకే 2047 లక్ష్యంతో అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేవలం 10 కిలోల దొడ్డు బియ్యం తప్పితే.. సంక్షేమం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనపై తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
సీఎం కావాలని కవిత..
ఇకపోతే.. కల్వకుంట్ల కవిత(kavitha) బీఆర్ఎస్ ను తన బ్యాటింట్ తో దంచికోడుతోందని వ్యాఖ్యానించారు. జైలుకు పోయి వచ్చినా కానీ.. సీఎం కావాలని కవిత అనుకుంటోందన్నారు. సీఎం కావాలని అందరికీ ఆశ ఉంటుందని, కానీ అత్యాశ ఉండొద్దని చురకలంటించారు. హరీష్ రావు(Harish Rao) కూడా బీఆర్ఎస్ కు దెబ్బకొడతారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్(KCR) కు ఉన్న ఇమేజ్ ఆ కుటుంబంలో ఎవరికీ రాలేదని తెలిపారు. బీఆర్ఎస్ కు భవిష్యత్ ఉంటే కవిత ఎందుకు బయటకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. నానాటికీ బీఆర్ఎస్ బలహీనపడుతోందన్నారు. గ్రౌండ్ లో కేడర్ లేదని, జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసినా ఓడిపోతామని తెలిసే కేసీఆర్ ప్రచారానికి రాలేదని పేర్కొన్నారు.
సోషల్ మీడియా ద్వారా..
కేటీఆర్(KTR) వద్ద డబ్బులున్నాయ్ కాబట్టి సోషల్ మీడియా ద్వారా నెట్టుకొస్తున్నాడని మహేశ్ కుమార్ ఎద్దేవాచేశారు. ఇదిలా ఉండగా అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమని, దేవగౌడ లాంటివాడే నిలబెట్టుకోలేకపోయాడని వివరించారు. చంద్రబాబు(Chandrababu) కిందా, మీద పడినా.. పెట్టుబడిదారులు హైదరాబాద్(Hyderabad) కే వస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అన్నివిధాలా బాగుందని, సీఎం విజన్ తో బూమ్ పెరుగుతుందన్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలసలు పెరిగాయన్నారు. తెలంగాణలో మళ్లీ తమ గవర్నమెంట్ రావడం చాలా సులభమైన విషయమని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. ఇకపోతే.. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాబోదని నొక్కిచెప్పారు. ఎస్ఐఆర్ తో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Also Read: Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

