Mahesh Kumar Goud: మీకు భవిష్యత్తు లేదని తప్పుడు ప్రచారాలా..!
Mahesh Kumar Goud (imagecredit:twitter)
Political News, Telangana News

Mahesh Kumar Goud: మీకు భవిష్యత్తు లేదు.. అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) తెలిపారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితి లేదన్నారు. కవిత మాట్లాడే మాటలకు బీ ఆర్ ఎస్ నుంచి సమాధానం చెప్పలేక టెన్షన్ పడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రజలు కూడా నమ్ముతున్నారన్నారు. అందుకే ఆపార్టీనీ ప్రజలు ఆదరించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవినీతిని, అక్రమాలను అంగీకరించరన్నారు. బీజేపీ హిందూ సెంటిమెంట్‌తో ఎన్నిసార్లు ప్రజల మద్దతు పొందగలరు? అని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ది పొందాలని బీజేపీ చూస్తుందన్నారు. దేవుళ్లను దేవుళ్ళ గానే చూడాలనీ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు తమ ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. భగవంతుడిని రాజకీయాల్లోకి రాగి ఓటు బ్యాంకు పొందాలనుకోవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీలో 90 శాత హిందువులమేనని చెప్పారు.

కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు

ఇకమంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదన్నారు. మొదటిసారి హైదరాబాద్(Hyderabad)బయట కాబినెట్ మీటింగ్ పెట్టడం శుభ పరిణామమన్నారు. సినిమా రంగంలో తమకు అంతా సమానమేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా చూస్తామన్నారు. ఇక జిల్లాల విభజన బీఆర్ఎస్ సర్కార్ లో అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఇలా ఎక్కడ జరగలేదన్నారు. ఇప్పుడు కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు, చేర్పులు చేయాలని తమ సీఎం భావిస్తున్నారన్నారు. జిల్లాలను తీసెయ్యాలన్న ఆలోచన తమకు లేదన్నారు. భూభారతిలో అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేస్తామని, పదవులు తక్కువ ఉండగా, డిమాండ్ అదికంగా ఉన్నదన్నారు. నీటి వాటా విషయంలో రాజీ లేదన్నారు. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదనీ నొక్కి చెప్పారు. పార్టీ మారిన నియోజక వర్గాల్లో పార్టీ నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

Also Read: Iran Unrest: సంచలనం.. ఇరాన్‌ నిరసనల్లో 2000 మంది మృత్యువాత!

వారి పై చర్యలు ఉంటాయి

మరో వైపు కవిత(Kavitha) కాంగ్రెస్ పార్టీ లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మాజీ సీఎం కూతురుగా కవిత చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ స్పందించాలన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించే హక్కు ఎవ్వరికి లేదన్నారు. మహిళా అధికారులపై అధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు ఉంటాయనీ హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్(BRS) హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని? తమ ప్రభుత్వం భర్తీ చేసినవి ఎన్ని? అనేది బీఆర్ఎస్ తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్‌కు చరిత్రే మిగిలుతుందనీ, ఫ్యూచర్ లేదన్నారు. బీఆర్ఎస్ దోపిడీకి కవిత వాఖ్యలే రుజువన్నారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ పై కవిత ఆరోపణల్లో వాస్తవం ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. దేవుని పేరు తీయకుండా బీజేపీ(BJP) రాజకీయం చేయదన్నారు.

ఇండస్ట్రీ ఎంకరేజ్ కోసం టిక్కెట్ రేట్లు

అసలైన హిందువులు కాంగ్రెస్ నేతలేనని, తామంతా ఇంట్లో పూజిస్తామని, అన్ని మతాలను గౌరవిస్తామన్నారు. తనకు సీఎం మధ్య ఎటువంటి గ్యాబ్ లేదన్నారు. మంత్రులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. మేడారంలో కేబినెట్ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు. సినిమా టిక్కెట్ రేట్లు ఎంత పెంచకూడదు అని ట్రై చేసినా.. సినిమా ఇండస్ట్రీ ఎంకరేజ్ కోసం టిక్కెట్ రేట్లు పెంచాల్సి వస్తుందన్నారు. ఒక నియోజకవర్గం 3 నుంచి 4 జిల్లా ల్లో ఉన్నదని శాస్త్రీయబద్దంగా జిల్లాల పునర్విభజన జరగాలన్నారు. డీసీసీ(DCC)లుగా నియమించిన వారందరికీ మళ్ళీ కార్పోరేషన్ పదవులు రెన్యూవల్ చేయమన్నారు. పార్టీలో ఒకరికి రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంఛార్జి మార్పు అనేది ఊహాగానమేనని, ఎటువంటి సమాచారం లేదన్నారు. సీపీఐ(CPI) బహిరంగ సభకు సీఎంను ఆహ్వానించారనీ, ఇది మంచి సంప్రదాయమన్నారు. టీజేఎస్, సీపీఐ పార్టీ నేతలకు కార్పోరేషన్ పదవులు ఇస్తామన్నారు. తలసాని మాటలు హద్దులు దాటాయనీ, వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికి ఇవ్వలేదన్నారు. ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఐఎఎస్(IAS)ల పై వచ్చిన వార్తల పై సిట్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అన్నారు.

Also Read: Megastar Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?.. బాస్ కొల్లగొట్టాడుగా..

Just In

01

Bandi Sanjay: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పథకం ఎందుకు వద్దు..?

Illegal Soil Mining: అనుమతులు లేకుండా అదును చూసి.. దర్జాగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు

Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?

AEO Workload Issues: పని భారంతో ఏఈవోలు సతమతం.. విజ్ఞప్తులు చేసిన ఉన్నతాధికారులు నో రెస్పాన్స్!

Mahesh Kumar Goud: మీకు భవిష్యత్తు లేదు.. అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మహేష్ కుమార్ గౌడ్