Jana Sena Party: తెలంగాణలో జనసేన పార్టీని విస్తృతస్థాయిలో తీసుకువెళ్లాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18 వ తేదిన గురువారం రోజున హైదరాబాద్Hyderabad)లో తెలంగాణ(Telangana)లోని ఉమ్మడి10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో ముఖ్య సమావేశం ఎర్పాటు చేయనున్నారు. కావున పార్టీలోని నియోజకవర్గం ఇన్చార్జిలు POC సభ్యులు, వివిధ పదవులల్లో ఉన్న నాయకులు మహిళలు, వాలంటీర్లు అందరూ తమ నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అంతా పాల్గొనేలా అందరూ బాధ్యతా తీసుకొవాలని తెలిపారు.
Also Read: Bigg Boss Telugu 9: డిమాన్ పవన్ బిగ్ బాస్ కప్పు కోసమే ఇలా చేస్తున్నాడా?
సమావేశం ముఖ్య ఉద్దేశం
సమావేశం యోక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికలలో సర్పంచులుగా, వార్డ్ మెంబర్లు గా జనసేన పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించి వారిని మరియు పోటీలో నిలబడి చివరివరకు గెలవడానికి ప్రయత్నించిన వారిని అభినందించనున్నారు. జడ్పిటిసి(ZPTC), ఎంపిటిసి(MPTC) ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు ఈ సమావేశంలో పాల్గొని మీ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. 150 డివిజన్లు ఉన్నా గ్రేటర్ హైదరాబాదును ప్రభుత్వం 300 డివిజన్లు చేసింది. కావున డివిజన్ల హద్దుల పూర్తి వివరాలు ప్రభుత్వం తరఫున అందాల్సి ఉంది. కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. డివిజన్ల వారిగా పార్టీని విస్తృతస్థాయిలో తీసుకెళ్లడానికి కార్యాచరణపై ఈ యొక్క సమావేశం ఉంటుందని తెలిపారు.
Also Read: IPL Auction 2026: ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్

