Orange Travels: జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు సునీల్ కుమార్(Sunik Kumar) అరెస్ట్ అయ్యారు. జీఎస్(GST)టీ చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించక పోవటంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో..
ఆరెంజ్ ట్రావెల్స్(Orange Travels) పేర సునీల్ కుమార్ ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్(Congress) పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. కాగా, ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్న సునీల్ కుమార్ 24 కోట్ల రూపాయల జీఎస్టీని ఎగ్గొట్టినట్టుగా గుర్తించిన అధికారులు ఈ విషయమై పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, సునీల్ కుమార్ వీటికి స్పందించ లేదు. దాంతో మంగళవారం రాత్రి సునీల్ కుమార్ ను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయంగా మారింది.
Also Read: Ponguleti Srinivas Reddy: ఈ ఏడాది ఆ నెలలోనే భూభారతి పోర్టల్.. భూముల కొలతల్లో ఇక అక్రమాలకు చెక్!
స్పందించిన సునీల్ కుమార్
దీనిపై సునీల్ కుమార్ స్పందిస్తూ ప్రతీ ఏటా నడుస్తున్న బస్సులపై ఆరెంజ్ ట్రావెల్స్ 5శాతం జీఎస్టీ చెల్లిస్తూ వస్తోందని తెలిపారు. అయితే, అధికారులు దానిని 12శాతానికి పెంచి అదనంగా మరో 24కోట్లు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఎన్నో కష్టనష్టాలకోరుస్తూ తాను ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్(Trillion Lead Factory Private Limited) ఎండీ చేతన్ 22 కోట్ల రూపాయల మేర జీఎస్టీ ఎగ్గొట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగ్గొడుతున్న వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నట్టు తెలియచేశారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ సోదరుడికి సిట్ నోటీసులు

