Operation Kagar: కేంద్ర ప్రభుత్వం తమ బలగాలతో, చత్తీస్గడ్ రాష్ట్రంలోని డిఆర్జి బలగాలతో సంయుక్తంగా మావోయిస్టులకు పట్టు ఉన్న అడవులను గాలిస్తూ ఆపరేషన్ కగార్(Operation Kagar)లో మరింత స్పీడ్ పెంచారు. బుధవారం ఒక్కరోజే 12 మంది మావోయిస్టులను మట్టుపెట్టారు. అదేవిధంగా మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అయినప్పటికీ మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ లను నిర్వహిస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్టుగానే అరెస్టులు చేయడం లేదంటే ఎన్కౌంటర్లో మట్టు పెట్టడమా అనే కోణంలోనే భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు.
మావోయిస్టుల కోసం డ్రోన్, హెలికాప్టర్లు
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరి వేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆపరేషన్ కగార్ లో భాగంగా చత్తీస్గడ్ -మహారాష్ట్ర లలో మావోయిస్టులు పట్టు సాధించిన ప్రాంతాలను డ్రోన్(Drone), హెలికాప్టర్లను భద్రత బలగాలు వినియోగిస్తున్నాయి. అత్యంత సూక్ష్మంగా ఉన్న పరిస్థితులను కూడా గుర్తించే విధంగా నూతన టెక్నాలజీని వాడుతున్నారు. పూర్తిస్థాయిలో మావోయిస్టులను ఏరు వేసేందుకు ఆపరేషన్ కగార్ కార్యక్రమాన్ని విస్తృత పరుస్తూ బేగం పెంచుతున్నారు.
Also Read: Kavitha On Pawan: ‘పక్కోడు బాగుంటే.. మా కళ్లు మండవు’.. పవన్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్!
గడ్చిరోలి, అబూజ్మడ్ అటవీ ప్రాంతాలను గాలిస్తున్న భద్రతా బలగాలు
మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలి(Gadchiroli), చత్తీస్గడ్(Chhattisgarh) రాష్ట్రంలోని మావోయిస్టులకు పట్టు ఉన్న అబూజ్ మద్ లతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మావోయిస్టులు లొంగిపోవాలి… లేదంటే ఎన్కౌంటర్లో మృత్యువాత చెందాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అతికొద్ది సమయంలోనే మావోయిస్టులను మొత్తం లేకుండా చేసి ఛత్తీస్గడ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించిస్తుంది. కర్రెగుట్టల ప్రాంతంలోని నంబి జలపాతం(Nambi Falls) ఏరియాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసి అక్కడి యువతకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మావోయిస్టుల అగ్ర నేతల కోసం నిఘా వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి.
Also Read: Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. బాంబును కొరికిన కుక్క మృతి..!

