Telangana Temples (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Temples: భక్తులకు తప్పిన తిప్పలు.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం..?

Telangana Temples: ఆలయాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం, మరోవైపు ఆలయాల్లో డిజిటల్ సర్వీసు(Online) అందుబాటులోకి తీసుకురాబోతుంది. అందుకోసం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని ఆలయాలన్నింటిని ఓకే గొడుగు కిందకు తీసుకురాబోతుంది. భక్తులకు అందించే సేవలతో పాటు ఆ ఆలయ ప్రత్యేకతను సైతం డిజిటల్ సర్వీసులో అందుబాటులో ఉంచనున్నారు. ఏ ఆలయానికి వెళ్లాలనుకుంటే ఆ ఆలయంలో సేవల వివరాలను తెలుసుకోవచ్చు. వెళ్లలేని వారు లైవ్ లో స్వామివారి పూజలు చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంను దృష్టిలో ఉంచుకొని దేవాదాయశాఖ సైతం భక్తులకు సేవలందించేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది.

ఆలయాల వివరాలు ఒకే యాప్‌లో..

ప్రతి ఒక్కరి చేతిలో ఆన్రైండ్ ఫోన్ సర్వసాధారణం అయింది. సాంకేతిక పరిజ్ఞానంకు అనుగుణంగా ఆన్ లైన్లో ఆలయాల సేవలను అందుబాటులో తేవాలని భావించిన ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఏ ఆలయం కు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే అందుకోసం దేవాదాయశాఖ డిజిటల్ సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఏ ఆలయంకు సంబంధించిన వివరాలను ఆ ఆలయానికి చెందిన పేరుతో ఉండేది. అలా కాకుండా ఆలయాలన్ని సెంట్రలైజ్డ్ చేసి అన్ని ఆలయాల వివరాలను ఒకే యాప్ లో నమోదు చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ‘క్యూ ఆర్ పే(‘QR Pay)’, ఐసీఐసీఐ(ICICI), ‘ఐ ఎం అవతార్(I Am Avatar)’ తో పాటు పలు కంపెనీలు రాగా మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

ఆయా కంపెనీలు ఏయే సేవలు అందించబోతున్నాయనే వివరాలను సేకరించి వాటిని మంత్రి పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ డేటాను డిజిటల్ సర్వీసులో ఎలా పొందుపరుస్తారు? వాటిని ఇతరులు చోరీ చేయకుండా ఎలాంటి సాప్టువేరును రూపొందిస్తున్నారు? ఆలయ వివరాల గోప్యత ఎంత? అనే వివరాలను స్టడీ చేస్తున్నారు. ప్రభుత్వంగానీ, దేవాదాయశాఖ గానీ రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ఆలయ సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆయా కంపెనీలపై ప్రజలకు ప్రస్తుతం ఉన్న విశ్వసనీయతపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Also Read: Ilaiyaraaja: అమ్మవారికి డైమండ్ కిరీటం సమర్పించిన మ్యూజిక్ డైరెక్టర్.. విలువ ఎంతంటే?

క్లీక్ చేస్తే ఆలయాల పేర్ల లిస్టు

ఆలయాల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరిస్తే శాస్త్రాల ప్రకారం ఏమైన తప్పు ఉంటుందా అనే వివరాలను సైతం ప్రభుత్వం వేదపండితులు, పీఠాధిపతులతో సంప్రదింపులు చేస్తుంది. వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్తేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు న్యాయనిపుణులు, ఐటీ నిపుణులతోనూ డిజిటల్ సర్వీసుల గోప్యతపైనా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6541ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలన్నింటినీ క్లాసిఫికేషన్ చేశారు. అయితే ప్రధానంగా ఆర్జేసీ, డీసీ కేడర్, 6-ఏ, 6-బీ, 6-సీ, 6-డీ కింద 763 ఆలయాలు ఉన్నాయి. అయితే ఇందులు ఫస్ట్ ఫేజ్-1 లో ఆర్జేసీ, డీసీ, 6-ఏ,6-బీ కింద మొతం 436 ఆలయాలను తొలుత డిజిటల్ సర్వీసులోకి తీసుకురాబోతున్నారు. తెలంగాణ టెంపుల్స్ అని క్లీక్ చేస్తే ఆలయాల పేర్ల లిస్టు కనబడుతుంది. అందులో ఏ ఆలయానికి వెళ్లాలనుకుంటే దానిపై క్లీస్ చేస్తే వివరాలు అని డిస్ ప్లే అవుతాయి. ఆలయ సేవలను సైతం తెలుసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచిైనా ఆలయ వివరాలు తెలుసుకోవచ్చు. అవగాహన లేనివారు సైతం మీసేవ కేంద్రాల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వ్యక్తి ఆలయాలనికి వెళ్లకుండానే ఇంటివద్దకే ప్రసాదం, అర్చన, అభిషేకం చేస్తే తనపేరుపై చేసుకునే అవకాశం కల్పించింది. స్వామివారికి అభిషేకం చేయా

ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే..

మరోవైపు ఆలయ ప్రాశస్త్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూలవిరాట్ ను సంబంధిత యాప్ లో చూపితే ఏమైన అరిష్టాలు ఉంటే వాటిని పొందుపర్చకుండా జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దేవాదాయశాఖ ఇప్పటికే టీ యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పూజలు, సేవలతోపాటు వసతి సౌకర్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునే వీలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. తొలివిడత రాష్ట్రంలోని 39 ప్రధాన ఆలయాల్లో ఈ మొబైల్‌ యాప్‌ ద్వారానే అన్ని సేవలను బుక్‌ చేసుకునే వసతి కల్పించనుంది. ఇప్పటికే 8 ఆలయాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చింది. యాదాద్రి, బాసర, కొండగట్టు, గణేష్ టెంపుల్ (హైదరాబాద్), భద్రాచలం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, ఉజ్జయిని మహాంకాళి (సికింద్రాబాద్), మల్లి కార్జున స్వామి (కొమరవెల్లి) ఆలయాల్లో ఆన్ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నది. బ్రేక్ దర్శనం, శీఘ్ర దర్శనం సహా అన్ని సేవలు సైతం అందుబాటులో ఉండటంతో భక్తుల సంఖ్య సైతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొబైల్ యాప్ సైతం ప్రభుత్వం తీసుకొచ్చే డిజిటల్ సర్వీసులోనే అంతర్భాగం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: GHMC: దశాబ్దాలుగా సీట్లకు అతుక్కుపోయిన అధికారులు.. ఎక్కడంటే..?

పలు సేవలు

సుప్రభాతం, అభిషేకం, అంతర్యాల అర్చన, సహస్త్రనామార్చన, నిత్యకల్యాణం, వెండి రథసేవ, ఆలయచుట్టు సేవ, వాహనసేవ, పవళింపుసేవ, ఉపాలయాల్లో అర్చనలు, గోపూజ, స్పెషల్ దర్శనం, సంధ్యాహారతీ, సువర్ణ తులసీ అష్టోత్తర నామార్చన, సువర్ణ పుష్ప అష్టోత్తరనామార్చన, పట్టాభిషేకం, సుదర్శన హోం, లక్ష్య కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, స్వామివారికి తులసీమాల అలంకరణ, నిత్యసర్వ కైంకర్యసేవ, నిత్యపూల అలంకరణ సేవ, తులాభరణం. వీటితో పాటు వారంవారం నిర్వహించే కార్యక్రమాలు…. అంతర్యాల అభిషేకం, ఆంజనేయస్వామివారి అభిషేకం, రంగనాయకస్వామివారి అభిషేకం, గోవిందరాజ్ స్వామివారి అభిషేకం,లక్ష్మీతాయారు అమ్మవారి అభిషేకం, యోగానందలక్ష్మీ నారాయణస్వామి వారి అభిషేకం, ఇవే కాకుండా 11 రకాల శాశ్వత పూజలు, శాశ్వత అన్నదానంలో మహారాజపోషకులు, రాజపోషకులు, పోషకులు ఇలా అన్ని సేవలను అన్ లైన్ లో పొందే అవకాశం కల్పించనున్నారు. మరిన్ని సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఆలయ చరిత్ర సైతం…

డిజిటల్ ఆలయ సేవలే కాకుండా ప్రతి ఆలయం చరిత్రను పొందుపర్చనున్నట్లు సమాచారం. ఆలయ నిర్మాణం ఎవరుచేశారు… ఎప్పుడు చేశారు… ప్రత్యేక ఏంటి?..విస్తీర్ణం, భక్తులకు వసతులు, ఆలయంలో సేవాకార్యక్రమాలు, పూజాకార్యక్రమాలు తదితర అన్ని వివరాలను అప్ లోడ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో భక్తులు ఆలయాలను సందర్శించేలా చేయాలని ప్రస్తుతం కసరత్తును ప్రారంభించింది. ఇతర రాష్ట్రాలకు భక్తులు వెళ్తున్న సందర్భంలో రాష్ట్రంలోనే అక్కడికన్న గొప్పగా ఆలయాలు ఉన్నాయమని, ప్రముఖ మైనవని, విశిష్టత ఉందనే వివరాలను యాప్ లో పొందపర్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.

Also Read: GHMC: దశాబ్దాలుగా సీట్లకు అతుక్కుపోయిన అధికారులు.. ఎక్కడంటే..?

ఆదాయం పక్కదారి పట్టకుండా..

ఆలయానికి వస్తున్న ఆదాయానికి గండిపడుతుందని, కొంతమంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తుంది. దానిని అరికట్టేందుకు డిజిటల్ సర్వీసును తీసుకురాబోతుంది. దర్శనం నుంచి అభిషేకం ఇలా ప్రతీది ప్రింటెడ్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో చేపట్టారు. అంతేగాకుండా ఆలయానికి దాతలు ఇచ్చే కానుకలకు సైతం సర్టిఫికెట్ ఇవ్వాలని దేవాదాయశాఖ భావిస్తుంది. అంతేగాకుండా ప్రతి రోజూ ఆలయానికి ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలు తీసుకోవచ్చు. అందుకోసం జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు మంత్రి సైతం ఎప్పటికప్పుడు ఆదాయం, భక్తుల వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్లో అడ్మిన్ అవకాశం ఇస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ చేయడంతో ఆదాయం పక్కదారి పట్టకుండా, ఉద్యోగులు సైతం విధిగా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు.

ఆ ఆలయంలో వసతులు..

ఇవే కాకుండా భక్తుల నుంచి ఆలయంలో సేవలు ఎలా ఉన్నాయి.. చేయాల్సినవి ఏమిటి? వసతుల కల్పన ఎలా ఉంది.. సేవాకార్యక్రమాలు, వసతులపై ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం సైతం ఈ డిజిటల్ సర్వీసులో కల్పించబోతున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఆ ఆలయంలో వసతులు, అభివృద్ధి చేపట్టనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారులతో ఈ సర్వీసుపై సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఎలాంటి రిమార్క్ రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Shailaja Ramayyar) సైతం డిజిటల్ సర్వీసుపై అధ్యయనం, ప్రైవేటు సంస్థలు ఇచ్చిన సర్వీసుకు సంబంధించి అందజేసిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భక్తులకు భగవంతుడికి అనుసంధానం చేసేందుకు ఈ డిజిటల్ సర్వీసు దోహదపడనుంది. త్వరలోనే ఈ సర్వీసు అందుబాటులోకి రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Also Read: Anushka Shetty: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. గుడ్ బై ? షాక్ లో ఫ్యాన్స్

Just In

01

Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్