Anushka Shetty: అనుష్క శెట్టి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అద్భుతమైన రాణి. అల్లు అర్జున్, మహేష్ బాబు, రజనీకాంత్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో పనిచేసి, ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి ఫెమేల్-సెంట్రిక్ చిత్రాలతో ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగింది. హీరో ఎవరైనా ఉన్నా, అనుష్క ఉంటే చాలు – అంటూ థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించి, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. కానీ, ‘బాహుబలి’ (2015) తర్వాత ఆమె ఒక్కసారిగా వెండి తెరకు కొన్నాళ్ళు దూరమైంది. ఏమైందో ఏమో.. మధ్యలో సినిమాలు చేస్తూ, పబ్లిక్ లైఫ్‌కు మొత్తం దూరంగా ఉంది.
సినిమాలకు దూరంగా ఉండటం ఒక్కటే కాదు, సోషల్ మీడియా కూడా అనుష్క రెగ్యులర్‌గా కనిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో అకౌంట్లు ఉన్నా, పండుగల విషెస్ చెప్పడం తప్ప యాక్టివ్‌గా లేదు. సినిమా ఈవెంట్లు, బయటి కార్యక్రమాల్లో కన్పించకపోవడం, ఫ్యాన్స్‌తో కనెక్ట్ కాకపోవడం లాంటివి.. ఆమె ఫ్యాన్స్‌ను ఎప్పట్నుంచో నిరాశలో ముంచెత్తాయి. మిగిలిన స్టార్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో దగ్గరవుతుంటే, అనుష్క మాత్రం మరింత దూరమవుతోంది. ఇప్పుడు, తాజా పోస్ట్‌తో మరోసారి ఆ గ్యాప్ పెద్దదవ్వనుంది.
Also Read: Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!
ఘాటీ’ ఫ్లాప్… ప్రమోషన్స్‌కు కూడా దూరం
ఇటీవల ‘ఘాటీ’ చిత్రంతో కమ్‌బ్యాక్ ఇచ్చిన అనుష్క. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరింత గమనార్హం ఏమంటే, ప్రమోషన్స్‌లో అనుష్క పాల్గొనలేదు. ట్రైలర్ లాంచ్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ పాల్గొనలేదు. ప్రమోషన్స్ లేకుండా సినిమాలు హిట్ కాకపోయిన ఈ టైంలో, ఆమె ఫేస్ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఫ్లాప్ తర్వాత, అనుష్క తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం, ఇది వైరల్ గా అయింది.
Also Read: Flyovers Safety: పీజేఆర్ ఫ్లైఓవర్ పై ప్రమాద నివారణ చర్యల పరిశీలన: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
సోషల్ మీడియాకు దూరంగా ఉంటా.. అనుష్క శెట్టి
అనుష్క తన పోస్ట్ లో.. ” బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్ కి వెళ్ళిపోతున్నాను. కొద్దీ రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. స్క్రోలింగ్ వెనక ఉన్న రియల్ వరల్డ్‌తో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో.. అక్కడి నుంచే స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాను. త్వరలో మీ ముందుకు మరిన్ని కథలు, మరింత ప్రేమతో వస్తాను” అంటూ రాసుకొచ్చింది. దీంతో, ఆమె సోషల్ మీడియా ‘బ్రేక్’ తీసుకుంటుందని క్లియర్ గా తెలుస్తుంది.
Also Read: Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం