Illegal Constructions ( Image Source: Twitter)
తెలంగాణ

Illegal Constructions: తుంకుంట లో జోరుగా అక్రమ నిర్మాణాలు స్పందించని అధికారులు

Illegal Constructions: తుంకుంట మున్సిపల్ పరిధిలో జోరుగా అనుమతులు లేని నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులకు మాత్రం కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు తావు లేదని, అక్రమ నిర్మాణాలు గానీ, కబ్జాలు గాని చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కబ్జాదారులు జంకుతలేరు. అక్రమ నిర్మాణాలు, నాళాల కబ్జాలు, భూ కబ్జాల పై ప్రభుత్వం హైడ్రా పేరుతో చర్యలు తీసుకున్న అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అక్రమ నిర్మాణాలకు చేస్తున్న, కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నా భయపడటం మాత్రం లేదు.

Also Read: Mirai Box Office Collections: స్టార్ హీరోలకి చుక్కలు చూపిస్తోన్న తేజ సజ్జా.. సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

తూముకుంట మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో గల సర్వే నెంబర్ 334 లోని సాయి నగర్ కాలనీలో (ల్యాండ్ మార్క్) వైట్ హౌస్ పక్కన అక్రమ నిర్మాణం జరుగుతుందని తుంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నోముల మధుసూధనరెడ్డి, నోముల సులోచన రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా నోటీసులు ఇచ్చామని పరోక్షంగా అక్రమ నిర్మాణాలను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ తెలిపారు.

Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

స్పందించని అధికారులు

అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు తూముకుంట మున్సిపల్ అధికారులను సంప్రదించగా అధికారులు స్పందించలేదు. ఇంత నిర్లక్ష్యంగా అధికారుల ప్రవర్తన ఉండడం సరైనది కాదన్నారు.

Just In

01

Fake Passbook: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

Ram Gopal Varma: అభిమానులకు రామ్ గోపాల్ వర్మ పెద్ద పరీక్షే పెట్టాడుగా.. అదేంటంటే?

SGT Post Fraud: డీఎస్సీ 2024 ఎస్‌జి‌టి పోస్ట్ ఎంపికలో.. డ్యూయల్ క్యాస్ట్ సర్టిఫికెట్ గుట్టు రట్టు

IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!