NIRF Ranking 2025 (imagecredit:twitter)
తెలంగాణ

NIRF Ranking 2025: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో ఐఐటీ.. తెలంగాణలో..?

NIRF Ranking 2025: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ప్రమాణాలు, పనితీరుకు గీటురాయిగా కేంద్ర విద్యాశాఖ ప్రతిఏటా నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(National Institutional Ranking Framework) జాబితాను రిలీజ్ చేస్తుంది. కాగా 2025కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీల ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. అందులో భాగంగా 2025కి గాను ఓవరాల్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణ(Telangana) పేరు లేకపోవడం గమనార్హం. ఇదే కేటగిరీలో టాప్ 100 లోనూ కేవలం 5 ఇనిస్టిట్యూషన్లు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. అందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(Indian Institute of Technology Hyderabad) 12వ ర్యాంకును కైవసం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(University of Hyderabad) 26వ ర్యాంకు సాధించింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ(OU) 53వ ర్యాంకు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) వరంగల్ 63వ ర్యాంకు, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(International Institute of Information Technology) హైదరాబాద్ 89 ర్యాంకుల్లో నిలిచాయి.

ప్రొఫెసర్ కుమార్ మొలుగరం

ఇదిలా ఉండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతంతో పోలిస్తే గణనీయమైన పురోగతి కనిపించింది. 2024లో 73వ స్థానం నుంచి ఏడాదిలోనే 17 స్థానాలు ఎగబాకింది. కొంతకాలంగా పరిశోధనలపై వర్సిటీ వ్యూహాత్మకంగా పెడుతున్న శ్రద్ధ, ప్రయత్నాలకు ప్రతి ఫలంగా ఈ గౌరవాన్ని అందుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో 2024లో ఉన్న 43వ స్థానం నుంచి 13స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాల విభాగంలో దేశంలో ఓయూ 7వ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా స్పందించిన ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం.. మెరుగైన ఓయూ ర్యాంకులు సమిష్టి కృషికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. వర్సిటీకి లభించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులపై హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Rappa Rappa Video: వినాయకుడిపై రప్పా రప్పా రాతలు.. ఎరుపు రంగుతో.. గొడ్డలి గుర్తువేసి ఊరేగింపు

భవిష్యత్తులో ఓయూ ను అన్ని రంగాల్లో మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. పరిశోధనల్లో సాధిస్తున్న స్థిరమైన ఫలితాలు, పురోగతి కారణంగానే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయని తెలిపారు. విశ్వవిద్యాలయ అధ్యాపక వర్గం చేస్తున్న కృషి, శ్రమకు ఈ ఫలితాలే సాక్ష్యమన్నారు. వర్సిటీ హెచ్‌ ఇండెక్స్ కూడా 121కి చేరిందని వీసీ తెలిపారు. ఈ స్ఫూర్తి, పట్టుదల, శ్రమను ఇలానే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌(NIRF) ర్యాంకుల్లో మరింత ఉన్నతస్థానాల్లో నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ జాబితాలో ఈ సానుకూల ఫలితాలు దేశీయంగా విద్య, పరిశోధన రంగాల్లో ఓయూ స్థానాన్ని సుస్థిరం చేస్తున్నాయని వివరించారు.

టాప్ 100 కాలేజీల్లో

ఇంజినీరింగ్ విభాగంలో టాప్ 100 ర్యాంకుల్లో తెలంగాణ నుంచి 7 ఇనిస్టిట్యూట్లు ర్యాంకులు సాధించాయి. ఐఐటీ(IIT) హైదరాబాద్ 7వ ర్యాంకు సాధించింది. వరంగల్ నిట్(Warangal Neet) 28వ ర్యాంకు, ఐఐఐటీ హైదరాబాద్ 38వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 74 ర్యాంకు, ఎస్ఆర్ యూనివర్సిటీ 91, జేఎన్టీయూ(JNTU) 94వ ర్యాంకులు సాధించాయి. ఇదిలా ఉండగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ కేటగిరీలో 26వ ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల విభాగాల్లో 18, ఇంజినీరింలో 74వ ర్యాంకును సాధించింది. ఇక రీసెర్చ్ ఇనిస్టిట్యూషన్స్ విభాగంలో 32వ ర్యాంకును యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా మెడికల్ విభాగంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 48వ ర్యాంకు దక్కింది. దేశవ్యాప్తంగా టాప్ 100 కాలేజీల్లో తెలంగాణ నుంచి కేవలం ఒక్క ఇనిస్టిట్యూట్ కు మాత్రమే ర్యాంకు దక్కడం గమనార్హం.

Also Read: Vijaya Rama Rao: కన్నతండ్రి కేసీఆర్‌పై కవిత ఒత్తిడి.. అందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం