Voter List Issue: నామినేషన్ వేయాలనుకున్న మహిళ పేరుమాయం
Voter List Issue (imagecredit:twitter)
నల్గొండ

Voter List Issue: సర్పంచ్​ ఎన్నికకు నామినేషన్ వేయాలనుకున్న ఓ మహిళ.. తీరా చూస్తే ఓటరు లిస్టులో పేరుమాయం..!

Voter List Issue: సర్పంచ్​ స్థానానికి పోటీ చేయాలనుకున్న ఓ మహిళ ఓటరు లిస్టులో తన పేరు లేకపోవటంతో హైకోర్టును ఆశ్రయించింది. మహబూబ్​ నగర్​ డీఎస్పీ కూతురైన రేణుక నల్గొండ జిల్లా దామరచర్ల గ్రామంలో ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్​ స్థానానికి పోటీ చేయాలనుకుంది. అయితే, ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవటంతో ఖంగు తిన్న ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండు రోజుల్లో దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. కాగా, సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టుకు సూచనప్రాయంగా ఆమెకు చెప్పినట్టు సమాచారం.

Also Read: Kodanda Reddy: భూమి హక్కు రైతుకు ఉన్నట్టే విత్తన హక్కు ఉండాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

నిబంధనలకు విరుద్ధంగా

నిబంధనల ప్రకారం ఓటరు జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటును తీసేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. దానికి ముందు ఎలక్ట్రోరల్​ రిజిస్ట్రేషన్​ ఆఫీస్​ లేదా బూత్​ లెవెల్ ఆఫీసర్ కు ఓటు మిస్సింగుపై ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్​ ఆఫీస్​ సరైన నిర్ణయం తీసుకోక పోతే జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేయాలి. అక్కడా చర్యలు తీసుకోకపోతే ఎన్నికల రాష్ట్ర ముఖ్య అధికారి వద్ద రివిజన్​ పిటిషన్ వేయాలి. మూడు దశల్లోనూ న్యాయం జరగక, ఎన్నికలు దగ్గర పడి సమయం లేకపోతే నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు.

Also Read: Rupee Fall: ఒక్క డాలర్‌కు 90 రూపాయలు… దారుణంగా పతనం.. సామాన్యులపై ప్రభావం ఇదే!

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!