Vehicle Seizure: మితిమీరి పోతున్న వాహనాల సీజింగ్ దందా
Vehicle Seizure (imagecredit:twitter)
Telangana News, నల్గొండ

Vehicle Seizure: మితిమీరి పోతున్న వాహనాల సీజింగ్ దందా.. ఇస్తావా చస్తావా అంటూ బెదిరింపులు..?

Vehicle Seizure: ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు వాహనాల సీజింగ్‌లో రూల్స్ పాటించటం లేదు. దౌర్జన్యమే పెట్టుబడిగా ఆర్థిక దందా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ బీ ఐ(RBI) గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఏజెన్సీ కోడ్ తో పాటు సీజింగ్ కు వెళ్లే వారికి ఐడి కార్డ్, కస్టమర్‌కు ముందస్తు నోటీస్ ఇవ్వటం వంటి చర్యల అనంతరం వాహనాలను సదరు ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గైడ్ లైన్స్ ను పాటించకుండా సీజింగ్ పేరిట కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ ఫైనాన్స్ సంస్థల అక్రమ వాహనాల సీజింగ్ వ్యవహారం నల్గొండ జిల్లాలో నల్గొండ(Nalgonda), దేవరకొండ(Dhevatakonda), మిర్యాలగూడ(Miryalaguda), నకిరేకల్(Nakirekal), ఇతర ఏరియాల్లో యదేచ్ఛగా నడుస్తోంది. మీరు ఈఎం ఐ చెల్లించట్లేదని మేము ఫైనాన్స్ సంస్థల సీజింగ్ విభాగం నుంచి వచ్చామని, రోడ్లపైనే వాహనాలను అడ్డుకుంటూ, రూల్స్ కు విరుద్ధంగా సమయపాలన లేకుండా ఇళ్ల వద్దకు వెళ్లి గోల చేయడంతో పాటు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లీగల్ యాక్షన్ ప్రక్రియ

వెహికల్ సీజింగ్ చేసి సీజింగ్ యార్డ్‌కి తరలిస్తే పెండింగ్ బాకీలన్ని కట్టాలని.. అలా జరగకుండా వదిలేయాలంటే చెప్పినంత ఇవ్వాల్సిందేనని బెదిరిస్తూ అందినంత దండుకొని దందా చేస్తున్నారు. వరుసగా మూడు ఈఎం ఐ లు(EMI) చెల్లించకపోతే సదరు ఫైనాన్స్ సంస్థలు లీగల్ యాక్షన్ ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉండగా.. ఆ అంశం పక్కన పెట్టేసి ప్రైవేట్ సీజింగ్ వ్యక్తులతో కస్టమర్లను భయభ్రాంతులకు గురి చేపిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ అడ్డగోలు వాహనాల సీజింగ్ వ్యవహారం తారా స్థాయికి చేరి పోలీసులకు సైతం ఫిర్యాదులు వెళుతున్న పరిస్థితి నెలకొంది.

సీజింగ్ దందాలో సుమారు 70 మంది

నల్గొండ జిల్లాలో పారిశ్రామికంగా వాణిజ్యపరంగా అత్యధిక వేగంగా అభివృద్ధి సాధిస్తున్న మిర్యాలగూడలో అదే స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఫైనాన్స్ సంస్థలు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. అయితే మిర్యాలగూడ పరిధిలోనే సుమారు 70 మందికి పైగా సీజింగ్ విభాగంలో పనిచేస్తున్నట్టు అంచనా. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఫైనాన్స్ చెల్లింపులో ఆలస్యమైన వాహనాలను ఆపి బెదిరింపులకు పాల్పడిన కొంతమందికి లోకల్ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also Read: Aadi Saikumar: రెండో సారి తండ్రి అయిన ఆది సాయికుమార్.. బేబీ బాయ్ పిక్స్ వైరల్..

సీజింగ్ దందాలో పాత నేరస్తులు

ఫైనాన్స్ సంస్థల తరఫున లారీలు, డీసీఎంలు, కార్లు, జేసీ బీ లను, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసే వాళ్లలో పాత నేరస్తులు, క్రైమ్ నేచురల్ కలిగిన వాళ్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ, సీతారాంపురం, ప్రకాష్ నగర్, ఇందిరమ్మ కాలనీ, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలకు చెందిన యువకులు సీజింగ్ పేరిట బెదిరింపులకు, గొడవలకు దిగుతున్నట్లు సమాచారం.

ఫిర్యాదులు ఇస్తే చర్యలు తీసుకుంటాం: మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు

ఇటీవల కొంతమంది మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ వద్ద పోలీస్ అవుట్ పోస్టులో నిలబడి వాహనాలను సీజ్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం రావడంతో వారిని పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చాము. ఫైనాన్స్ సంస్థల నుంచి వాహనాలను సీజ్ చేసేందుకు వచ్చామని చెబుతూ బెదిరింపులకు దిగిన, రూల్స్ కు విరుద్ధంగా సీజ్ చేస్తామని హెచ్చరించిన ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. కస్టమర్లు భయపడకుండా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తాం. ఫైనాన్స్ సంస్థలు ఇల్లీగల్ గా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు.

Also Read: Uttam Kumar Reddy: నదీ జలాల సమస్యపై ఎవరితోనైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: మంత్రి ఉత్తం

Just In

01

IPL-Bangladesh: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు

Road Safety: పాఠశాల విద్యార్థుల భద్రత డ్రైవర్లదే: ఇన్‌స్పెక్టర్ కంచి వేణు

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

TG Medical Council: మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం.. చిచ్చు పెట్టిన జీవో 229.. అసలు కారణం అదేనా?