MP Mallu Ravi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం అర్హులైన పేదలకు అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తాంమని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు పి అమరేందర్,దేవ సహాయం, లతో కలిసి జిల్లా అభివృద్ది సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశానికి ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రగతిపథంలో ముందుంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన కు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని జాతీయ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులకు సూచించారు.
Also Read: Kota And Naga Babu: ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు దారుణంగా అవమానించిన నాగ బాబు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి యూనిట్ల ఏర్పాటు వల్ల ప్రజలు ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఉపాధి పథంలో ముందుంటుందని, బ్యాంక్ అధికారులు నిర్దేశించిన టార్గెట్‌ను రీచ్ అయ్యేలా ప్రణాళికబద్ధంగా పనిచేసే జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి, జిల్లా పేద ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, జిల్లాను ముందుకు నడిపించడం చాలా ముఖ్యమని, ఈ మూడు రంగాలలో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. 2017 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు అందించే రుణాల గ్రౌండింగ్ ను పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల నివారణ మరియు నాణ్యమైన చికిత్సకు చర్యలు తీసుకోవడం ద్వారా వైద్య రంగంలో అభివృద్ధికి బాటలు వేసేలా చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాను అందించాలని, 100% విద్యార్థుల నమోదు ప్రక్రియను చేపట్టి పూర్తిస్థాయిలో విద్యార్థులను నమోదు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని, నీటిపారుదల కాలువల ఆధునికీకరణ, పూడిక తీత పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.