Tummala Nageswara Rao (imagecredit:twitter)
తెలంగాణ

Tummala Nageswara Rao: 950 మంది రైతులు.. అందనున్న 4 కోట్ల పరిహారం

Tummala Nageswara Rao: స్వేచ్ఛ వరుస కథనాలతో ఏజెన్సీ మండలాలైన వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట ఆదివాసి రైతులకు మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బెడ్ విత్తన(Multinational Maize Cross Bed Seed) కంపెనీల ద్వారా రైతులకు చెక్కులను అందించనున్నారు. దాదాపు 950 మంది ఆదివాసి రైతులకు దాదాపు రూ.4 కోట్ల విలువైన చెక్కులను వాజేడు మండలంలోని రైతు వేదికలో అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Min Tummala Nageswara Rao), పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క(Min Seethakka), రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరుకానున్నట్లు సమాచారం.

రైతు కమిషన్ ఇటు సీడ్ కమిషన్
స్వేచ్ఛలో ఆర్గనైజర్ల ఆగడాలపై రాసిన వరుస కథనాల నేపద్యంలో అటు రైతు కమిషన్ ఇటు సీడ్ కమిషన్ చైర్మన్లు స్పందించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ దివాకర్(Dhiva kar) టిఎస్ సైతం స్వేచ్ఛ కథనాలకు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులకు ఆర్గనైజర్లు చేసిన మోసాలపై నివేదిక తయారు చేశారు. నివేదిక ఆధారంగా రైతులకు పంట నష్ట పరిహారం కోసం చెక్కులను అందించనున్నారు. స్వేచ్ఛకు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Also Read: Dhammapet Revenue Office: గతంలో రికార్డులు తగలబడిన కేసు.. ఉద్యోగికి ప్రమోషన్

పరిష్కారం మార్గం అనే ట్యాగ్
స్వేచ్ఛ కథనాలతో డైరెక్టుగా ఇన్ డైరెక్ట్‌గా దాదాపు 8 కోట్ల రూపాయలు నష్టపరిహారం రైతులకు అందించినట్లు అయింది. స్వేచ్ఛ తోనే సమస్యలకు పరిష్కారం మార్గం అనే ట్యాగ్ లైన్‌తో వరుస కథనాలు రాయడంతో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు వేగంగా స్పందించారు. స్వేచ్ఛ కథనాల ఫలితమే రైతులు నేడు నష్టపరిహారాన్ని పొందుతున్నారు. ఎట్టకేలకు స్వేచ్ఛ రాసిన వరుస కథనాలకు ఫలితం రావడంతో రైతులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

Also Read: Warangal: ఇన్స్‌స్టా గ్రామ్‌లో రీల్ పోస్ట్.. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది