Chairman Anvesh Reddy(image crdit: twitter)
తెలంగాణ

Chairman Anvesh Reddy: రైతు సంక్షేమ పాలనకు సహకరించని మోదీ!

Chairman Anvesh Reddy: తెలంగాణ రైతుల విషయంలో కేంద్రం వ్యవ‌హరిస్తున్న తీరు స‌రికాద‌ని సీడ్ కార్పొరేష‌న్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యత‌లు చేప‌ట్టిన నాటి నుంచి తెలంగాణ‌పై చూపిస్తున్న వివ‌క్షత అనేక సంద‌ర్భాల్లో ప్రస్ఫుటంగా క‌నిపించింద‌న్నారు. ధాన్యం దిగుబ‌డిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజాపాల‌న‌లో రైతుల‌ను అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చిన రుణ‌మాఫి, రైతు భ‌రోసా, స‌న్నాల‌కు బోన‌స్ లాంటి ప‌థ‌కాలు రైతుల‌కు మేలు చేశాయ‌న్నారు.

హాకా భవన్‌లో అన్వేష్ రెడ్డి ఉర్ధూ అకాడ‌మీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, వారికి యూరియా స‌మ‌స్యగా మారిందన్నారు. కేంద్రం ప్రతినెలా నిర్ణీత కేటాయింపులు సరఫరా చేయక‌పోడ‌మే ప్రధాన కార‌ణ‌మ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏప్రిల్​, మే, జూన్ నెల‌ల‌కు సంబంధించిన కోటా కింద‌ రూ.5 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే, జూలై నెల వచ్చినా ఇంకా సగం ఎరువులు కూడా సరఫరా చేయని పరిస్థితి ఉన్నదని మండిపడ్డారు. రైతులకు సరిపడా ఎరువులు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడ్తున్నారన్నారు.

 Also Read: TG New Ration Cards: 14న కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

ఇద్దరు కేంద్ర మంత్రలు, ఎంపీలు ఏం చేస్తున్నట్లు
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, (Bandi Sanjay) కిషన్ రెడ్డిలు, ఎనిమిది మంది ఎంపీలున్నా దండ‌గేనని అన్వేష్ రెడ్డి (Anvesh Reddy)  అన్నారు. ఒక్కరు కూడా ఎరువుల స‌మ‌స్యపై మాట్లాడ‌లేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మంత్రులా.. లేక మ‌రో రాష్ట్రానికి చెందిన మంత్రులా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. రాష్ట్ర రైతాంగానికి అశ‌నిపాతంలా మారిన ఎరువుల స‌మ‌స్యపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు న‌డ్డా, శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ల‌పై ఎందుకు ఒత్తిడి తీసుకురావ‌డం లేదని ప్రశ్నించారు.

రైతాంగాన్ని, వ్యవ‌సాయాన్ని విధ్వంసం చేసి ఆ పాపాన్ని కాంగ్రెస్ (Congress)  పైకి నెట్టేలా ఒక కుట్ర పూరిత వైఖ‌రి అవ‌లంబిస్తోంద‌న్న అనుమానం క‌లుగుతున్నదన్నారు. మ‌త విద్వేషాలు, కాకుంటే జ‌న‌జీవ‌న విధ్వంసం, రెండూ కుద‌ర‌క‌పోతే రైతాంగాన్ని కుదేలు చేయ‌డం, మోదీ, అమిత్ -షాల రాజ‌కీయంగా మారింద‌ని ప్రజ‌ల‌కు అర్థమ‌వుతున్నదని అన్నారు.

రాష్ట్రంలో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సమస్య

రాష్ట్రానికి సరిపడా యూరియాను కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) కేంద్రాన్ని కోరారు. యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర కెమికల్​ అండ్​ ఫర్టిలైజర్స్​ మంత్రి జగత్​ ప్రకాశ్​ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి,(Kishan Reddy) బండి సంజయ్‌కు (Bandi Sanjay) లేఖలు రాశారు. ఖరీఫ్​ సీజన్​ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం అంతకంతకు పెరిగిపోయిందన్నారు. ఏప్రిల్​, మే, జూన్​ నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్​ టన్నుల కోటా నిర్దేశించిందని, అందులో ఇప్పటివరకు 3.06 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని తెలిపారు.

1.94 లక్షలక్​ టన్నుల యూరియా కొరత

అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా కొరత ఏర్పడిందన్నారు. తాజాగా జూలై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్​ ప్రకారం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్​ టన్నులు రావాలని, అందులో 60 శాతం ఇంపోర్టెడ్​ యూరియాను కేటాయించటం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో చేరుకునే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖరీఫ్​ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు.

వెంటనే కేంద్రం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జూలై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్​ యూరియాకు నౌకలను కేటాయించాలని కోరారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుండి 60,000 టన్నులకు పెంచాలని కోరారు. ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలన్నారు.

 Also Read: Gujarat lawyer: వామ్మో ఇదేందయ్యా ఇది.. జడ్జి ముందే బీర్ కొట్టిన లాయర్.. వీడియో వైరల్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు