TG New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల (New Ration Cards )పంపిణీకి సిద్ధమైంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
2.5 లక్షల కొత్త రేషన్ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2.5 లక్షల (Ration Cards ) రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13లోగా రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, అర్హులైన వారందరినీ ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. అర్హులైన వారందరికీ కొత్త కార్డులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Gold Rates (03-07-2025): ఆషాఢంలో మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
నల్లగొండ కీలక పాత్ర..
ఉమ్మడి (Nalgonda District) నల్లగొండ జిల్లాకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. గతంలో హుజూర్‌నగర్ నుంచే సన్నబియ్యం పంపిణీ మొదలుపెట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఉపఎన్నికల సమయంలో రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి అరకొరగా మాత్రమే పంపిణీ చేసిందని విమర్శించారు. తాము పూర్తిస్థాయిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, గతంలో దొడ్డు బియ్యం ఎక్కువగా పౌల్ట్రీ ఫాంలు, బీర్ కంపెనీలకు వెళ్ళేవని పేర్కొన్నారు.
ఎస్ఎల్బీసీ పనుల పునఃప్రారంభం..
ఎస్ఎల్బీసీ పనుల పునఃప్రారంభానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. భారత సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకొని ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూలై మూడో వారంలో “ఎలక్ట్రో మాగ్నెటిక్” అండ్ “లైడర్ సర్వే” చేయబోతున్నామని, ప్రపంచంలోనే అధునాతన సాంకేతికతతో టన్నెల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో టన్నెల్ నిర్మాణంలో నిపుణులైన మిలటరీ నిపుణులు జనరల్ హార్బర్ సింగ్ సహా మరో అధికారి సహాయం తీసుకుంటున్నామని, వారిని డిప్యూటేషన్‌పై తీసుకున్నామని వెల్లడించారు.
ఇతర ప్రాజెక్టుల పురోగతి..
డిండి, హెచ్‌ఎల్‌సీ లైనింగ్, నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్, బునియాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేసే విషయంలో శాసనసభ్యులు దృష్టి సారించాలని కోరారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైందని, మంత్రి కోమటిరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్ఎల్బీసీ మొత్తం 44 కిలోమీటర్ల పొడవులో 35 కిలోమీటర్లు పూర్తైందని, దీని ద్వారా ఉమ్మడి జిల్లాకు 30 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిండి ప్రాజెక్టును రూ. 1800 కోట్లతో పనులు మొదలుపెట్టబోతున్నామని, హైలెవెల్ కెనాల్ కోసం రూ. 450 కోట్లు మంజూరు చేశామని అన్నారు.
547 కోట్లతో 1.5 టీఎంసీతో పనులు
నెల్లికల్ లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బునాదిగాని, పిల్లయిపల్లి, ధర్మారెడ్డి కాలువ పనులు మూసి నీటిపై ఆధారపడ్డాయని తెలిపారు. (Farmers) రైతులకు సరైన ధరలను భూసేకరణకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఒక సీజన్ క్రాప్ హాలిడే ఇస్తేనే పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. అయిటిపాముల లిఫ్ట్ ఆరు నెలల్లో పూర్తవుతుందని, గంధమల్ల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గించి రూ. 547 కోట్లతో 1.5 టీఎంసీతో పనులు ప్రారంభిస్తామని అన్నారు.
మిర్యాలగూడ పరిధిలో లిఫ్ట్ స్కీంల పురోగతిపై ఆరా తీశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో దేవాదుల రివైజ్ ఎస్టిమేట్స్ కమిటీలో అప్రూవల్ కావాలని, బస్వాపూర్ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కోసం రూ. 70 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అధికారులు ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ, పారదర్శకతతో ప్రజలకు కనిపించేలా పని చేయాలని మంత్రి సూచించారు. నెలలో రెండుసార్లు సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, ఉమ్మడి (Nalgonda District) నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడానికి కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
Also Read: Raja Singh vs BJP: పార్టీ నిర్ణయంపై సర్వాత్ర ఆసక్తి.. అలక మాని కాషాయ పార్టీలో కొనసాగుతారా?