MLC Kavitha (imagcredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందే మహిళలే.. ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, యాకుత్ పురా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు శనివారం హైదరాబాద్(Hyderabad) లోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతిలో చేరారు. వారికి జాగృతి కండువాలు కప్పి పార్టీలోకి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ పసుపు బోర్డును ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఇప్పుడు మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుకు పదే పదే ప్రారంభోత్సవాలు చేయడం కాదు. పసుపు బోర్డుకు ఇదివరకే ప్రారంభోత్సవాలు చేసిన సంగతి ఎంపీ అర్వింద్(MP Aravindh) కేంద్ర హోం మంత్రికి చెప్పకపోవచ్చని అన్నారు.

అమిత్ షా స్పష్టత ఇవ్వాలని డిమాండ్

కేంద్రంమంత్రి నిజామాబాద్ లోనే పసుపునకు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించి వెళ్లాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు(Turmeric Board) చట్టబద్ధత కల్పించకపోవడంతో బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. అమిత్ షా మద్దతు ధరపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్(Congress) బతికిందంటే అది మహిళల వల్లనే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ(Indira Gandhi), సోనియా గాంధీ(Sonia Gandhi)లే నిలబెట్టారని తెలిపారు. మహిళల గురించి జగ్గారెడ్డి(Jagga Reddy) చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ విధానమా అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) ను ప్రశ్నించారు. బీసీ(BC)ల రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని, ఆ బిల్లును పాస్ చేస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!

జయశంకర్ ఆలోచనల్లోంచి

యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. జయశంకర్(Jayashankar), కేసీఆర్(KCR) ఆలోచనల్లోంచి తెలంగాణ జాగృతి ఆవిర్భవించిందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలపై వారి తరపున తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం మినహా ప్రజల కోసం చేసిందేమి లేదన్నారు. రోషన్, అజయ్ నాయక్, పంకజ్ షిండే, వికాస్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు తెలంగాణ జాగృతిలో చేరారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో

గ్రామ రెవెన్యూ సేవకుల (VRO) వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. వీఆర్ఏ జేఏసీ(VRO JAC) నాయకులు కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు ఉండగా కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16,758 మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 61 ఏళ్ల వయసు పైబడిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

Also Read: Law Student: ‘లా విద్యార్థిని’పై అఘాయిత్యం.. మరో ఘోరం

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?