CCI Cotton Procurement: అశ్వాపురం మండలం నెల్లిపాక లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంట కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా ఉండాలని రైతులు నష్టపోయే విధంగా వ్యవరించవద్దని
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. పత్తిని విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు.
కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి రైతులకు అధికారులు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ అప్ (KAPAS KISAN APP ) స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ డి ఏ తాతారావు, ఏ వో మహేష్ చంద్ర చటర్జీ, జిన్నింగ్ మిల్ యజమానులు నూకారపు బిక్షమయ్య, రామకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్, వెంకట్ రెడ్డి,తూము వీరరాఘవులు, కృష్ణారెడ్డి, రైతులు సురకంటి ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి సత్యం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
