Mission Bhagiratha (imagecredit:twitter)
తెలంగాణ

Mission Bhagiratha: మరో కీలక బాధ్యతలను స్వీకరించిన మంత్రి సీతక్క..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mission Bhagiratha: రాష్ట్రంలో మిషన్ భగీరథకు నూతన బోర్డును ఏర్పాటు చేశారు. ఆబోర్డు ఆప్ డైరెక్టర్స్ కు బోర్డు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బోర్డు చైర్ పర్సన్ గా మంత్రి సీతక్క, వైస్ చైర్మన్-ఎండీగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ ను నియమించారు. 8 మంది డైరెక్టర్లుగా కె.రామక్రిష్ణారావు, టీకే శ్రీదేవి, జి.శ్రీజన. జి. కృపాకర్ రెడ్డి, జి.అనిల్ కుమార్, పి. వెంకటేశ్వర రెడ్డి, పి. శ్రీనివాస్ రెడ్డి, జె. మధుబాబు ను నియమించారు. అనంతరం బోర్డు సమావేశంలో 23 అంశాలకు ఆమోదం తెలిపింది.

Also Read: NFBS scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా? కష్ట సమయంలో ఇదే ఆధారం.. తప్పక తెలుసుకోండి 

గత బోర్డు మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి నివేదిక, రీ కానిస్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, డిజైన్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్స్ మానిటరింగ్ సిస్టం కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలను 2024-25 కొనసాగింపునకు నోటిఫికేషన్ , 2023 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కు ఆమోదం, ప్రస్తుతం వినియోగిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ల సేవలను 2025-26 ఏడాదికి వరకు కొనసాగించనున్నారు.

ఇంటర్నల్ ఆడిటింగ్ కోసం ప్రస్తుం ఉన్న సెక్రటేరియల్ ఆడిటర్స్ సేవలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  పైప్ లైన్ మరమ్మతులు, నిర్వహణపై అకౌంటింగ్ పాలసీ ప్రతిపాదనకు ఆమోదం, మరియు ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగిన జలజీవన్ మిషన్ సమావేశానికి హాజరైన అధికారుల ప్రయాణ ఖర్చుల చెల్లింపు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మిషన్ భగీరథ కనెక్షన్లను తొలగించిన కంపెనీల బకాయిలను రద్దు చేయాలని ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. వివిధ అంశాలను నూతనబోర్డు ఆమోదించింది.

Also Read: CM Revanth – Delimitation: సౌత్ చూపంతా తెలంగాణ వైపే.. సీఎం రేవంత్ వాట్ నెక్ట్స్?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్