Miss World contestants (imagecredit:swetcha)
తెలంగాణ

Miss World contestants: అందం అంటే సౌందర్యం కాదు అంతర్గత శక్తి.. మంత్రి సీతక్క!

Miss World contestants: ఇందిరా మహిళా శక్తి బజార్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎన్నో రకాల వ్యాపారాలను ఏర్పాటు చేయిస్తున్నాంమని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా ప్రగతి సమాజ ప్రగతి అన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించడం అభినందనీయమని, అవి కేవలం చారిత్రక ప్రదేశాలే కావు కష్టానికి, తెగింపునకు, పోరాటానికి కేంద్రాలు నాగరిక చరిత్రలో మొదట మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని, కానీ కార్యక్రమంలో ప్రపంచం మొత్తం పితృస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళిందని అన్నారు. దీనివల్ల మహిళలు తమ ఆర్థిక స్వాతంత్రతను కోల్పోయారు. కానీ కాలం మారింది, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.

ఇందిరా మహిళా శక్తి బజార్

మిస్ వరల్డ్ పోటీలను 72 ఏళ్ల తర్వాత తెలంగాణ వేదికవ్వడం మార్పుకు సంకేతమని అన్నారు. అందము అంటే బాహ్య సౌందర్యం కాదు అందమంటే అంతర్గత శక్తి సామర్థ్యాలు, మేధస్సు, స్వేచ్ఛ భావన, స్థితప్రజ్ఞత మహిళలు కోల్పోయిన ఆర్థిక స్వతంత్రతను, సాధికారతను తిరిగి సాధించేందుకు తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. మాకు మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి ఒక్కటే కాదు,సాధికారత అంటే విద్యకు, ఉపాధికి, ఆర్థిక శక్తికి, సమాన హక్కులకు అవకాశాలు కల్పించడం గ్రామీణ పేదరిక మహిళల ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా ప్రతి మహిళకు గౌరవప్రదమైన జీవితం ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళల కలలు, నైపుణ్యము, కష్టపడే తత్వానికి కలబోతగా నిలుస్తోందని, ఇక్కడ లభించేది కేవలం వస్తువులే కాదు మహిళా విజయాలకు, పరివర్తన గాధలకు చిరునామా ఇందిరా మహిళా శక్తి బజార్ అని అన్నారు.

Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల నిరవధిక దీక్ష.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటన

ఇది కేవలం ఒక మార్కెట్ కాదు

సుందరి మనులు, గ్రామీణ శ్రామిక మహిళలు సమానమే అని చాటి చెప్పేందుకు మిస్ వరల్డ్ పోటీకి దారులను ఇక్కడికి ఆహ్వానించాము లోకల్ టు గ్లోబల్ అనే జీవన మంత్రాన్ని మీకు ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాంమన్నారు. ఇది కేవలం ఒక మార్కెట్ కాదు. సామాజిక మార్పుకు ఇది ఒక సంకేతమన్నారు. ఇక్కడ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడంతోపాటు సంపద సృష్టిలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, విద్యుత్ ప్లాంట్లు, పౌల్ట్రీ వ్యాపారము, బస్సు ఓనర్లు, మేనేజర్లు ఇలా 20 కి పైగా వ్యాపారాలు ఏవంతంగా నిర్వహిస్తున్నారు. 46 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని వేల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా సమకూరుస్తున్నామని, మహిళలు తీసుకున్న లోన్లు పూర్తిస్థాయిలో తిరిగి చెల్లిస్తున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎగవేత దారులుగా మిగులుతుంటే మహిళా సంఘ సభ్యులు తమ లోన్లు 100% మేరా తిరిగి చెల్లిస్తున్నారని అన్నారు.

సమానత్వానికి దిక్సూచి.

కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వప్నాన్ని నిజం చేసి చూపిస్తాం, ఇందిరా మహిళా శక్తి సాధికారతకు, సమ్మిళిత అభివృద్ధికి, సమానత్వానికి దిక్సూచిగా నిలుస్తోందన్నారు. ఎర్న్, ఎంపవర్, ఎవాల్వ్ సాధనే మా లక్ష్యం సంపాదన, సాధికారత, సామాజిక మార్పు మాకు దారి దీపాలు మా లక్ష్యసాధన కి ఇందిరా మహిళా శక్తి బజార్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడ ఆర్థిక అవకాశాలే కాదు. సామాజిక పరివర్తన ఉద్యమానికి ఇదే పునాది రాయి. మిస్ వరల్డ్ పోటీదారులు అంతా మా మహిళా సంఘాల స్టాల్స్‌ను సందర్శించారు. అది కేవలం స్టాల్స్ కాదు. శక్తివంతమైన రేపటి మహోదయానికి మూల స్తంభాలు తెలంగాణ మహిళల స్ఫూర్తిని శక్తిని మీలో నింపుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఆహ్వానం మేరకు ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: CM Revanth Reddy: కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు.. సీఎం సంచలన కామెంట్స్!

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్