CM Revanth Reddy: కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి సాయం అందించడంలో కిషన్ రెడ్డి పాత్ర జీరో అన్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ…ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆర్ధిక సరళీకృత విధానాలతోనే బలమైన ఆర్ధిక దేశంగా నిలపెట్టారన్నారు.
యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారన్నారు. పహల్గమ్ ఘటన నేపథ్యంలో ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతీ ఒక్కరూ గుర్తు తెచ్చుకున్నారని వివరించారు. తీవ్రవాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. తమ దేశాన్ని రక్షించుకునే శక్తి ఉన్నదని, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ధైర్యంగా ఎదుర్కొన్నారని వెల్లడించారు.
Also Read: BRS Harish Rao: దేశానికి ఆదర్శంగా తెలంగాణ.. మాజీ మంత్రి హరీష్ రావు!
ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేయడం ఏమిటని? నిలదీశారు. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని వెల్లడించారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయదని, దేశ భద్రతకు కట్టుబడి మద్ధతు ఇస్తుందన్నారు. భారత జవాన్లకు అండగా నిలబడుతుందన్నారు.
Also Read: Crime News: మహిళా డాక్టర్‌పై.. మరో డాక్టర్ అత్యాచారం!