Women Policy: సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని మంత్రులు అనసూయ సీతక్క(Seethakka), కొండా సురేఖ(Konda Sureka) న్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు అందించే దిశలో పని చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. సచివాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ, సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగులచే ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహిళలకు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ విధి నిర్వహణలో అద్భతంగా ప్రభుత్వ ఉద్యోగంలో రాణిస్తున్నారని, మహిళకు ఉద్యోగం అంటేనే అదనపు బాధ్యత, ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరొకవైపు వృత్తి బాధ్యతలు.. రెండింటిని ఏకకాలంలో నెరవేర్చుతున్న మహిళా ఉద్యోగులను ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, పథకాలు విజయవంతం కావడానికి ప్రభుత్వ ఉద్యోగుల కృషి కీలకమన్నారు. ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సంఘం సభ్యులు శైలజ, మంగ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: 20 నెలల పాలనలో.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని.. కళ్లకు కట్టిన సీఎం రేవంత్
మహిళలకు స్వయం ఉపాధి
రాష్ట్రంలో ప్రభుత్వం రూపొందించే మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం సమృద్ధి కోసం రూపొందించే ఓక సమగ్ర విధానాన్ని మహిళా పాలసీ అని పిలుస్తారు. దీన్ని రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాలు వేరువేరుగా అమలు చేస్తాయి. బాల బాలికలకు విద్యను ప్రోత్సహించడం, ఉచిత విద్య, మరియు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు. మహిళలకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, చిన్న స్థాయి నుంచి వ్యాపారాల ప్రోత్సాహించడం, మహిళల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార పథకాలు. మహిళలపై హింస, వేధింపులు నివారించేందుకు చట్టపరమైన చర్యలు, హెల్ప్‌లైన్‌లు ఎర్పాటు చేసుకోనుటకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.
Also Read: KTR: ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు