Seethakka Meets KCR: మేడారం మహా జాతరకు రావాలంటూ కేసీఆర్‌కు మంత్రులు సీతక్క, సురేఖ ఆహ్వానం
తెలంగాణ సాంప్రదాయంగా మంత్రులకు మర్యాదలు చేసిన కేసీఆర్ దంపతులు
తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న మంత్రులు
గజ్వేల్ , స్వేచ్ఛ: వనదేవతలు సమ్మక్క సారక్కలమ్మల మేడారం మహా జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ (Seethakka Meets KCR) ఆహ్వానించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు గురువారం మధ్యాహ్న సమయంలో చేరుకొని కేసీఆర్ దంపతులను కలిశారు. ఆహ్వాన పత్రాన్ని అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు మహా జాతర ఉత్సవాల ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ దంపతులకు మహా జాతర ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి దీవెనలతో కూడిన పట్టు వస్త్రాలను అందించారు. మహా జాతరకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ మంత్రులు కోరారు. కాగా మంత్రులు కొండ సురేఖకు, సీతక్కకు తెలంగాణ ఆడ ఆడబిడ్డలకు అందించే గౌరవ మర్యాదలను కేసీఆర్ దంపతులు అందించారు. పసుపు, కుంకుమ, చీరతో మంత్రులను సన్మానించారు.
Read Also- Kannada Actress: పురుషులను కుక్కలతో పోల్చిన కన్నడ నటి.. నెటిజన్లు ఏం చేశారంటే?
కేసీఆర్ సానుకూలంగా స్పందించారు: మంత్రులు
మేడారం జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను తాము ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని మంత్రులు సీతక్క, కొండా సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ వన దేవతల జాతర పార్టీలు, కుల,మత, ప్రాంతాలకు అతీతంగా జరుగుతుందని, రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అమ్మల దర్శనానికి భక్తులు వస్తారని పేర్కొన్నారు. మేడారంలో వనదేవతల దర్శనానికి భక్తులకు సౌకర్యవంతంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులను, మహా జాతరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని వివరించారు. మహా జాతరకు వచ్చి వనదేవతల దీవెనలు పొందాలని కేసీఆర్ దంపతులకు సూచించామని పేర్కొన్నారు. కేసీఆర్ దంపతులు తమకు మర్యాదపూర్వకంగా చీరే సారెతో సన్మానించారని వెల్లడించారు. కేసీఆర్ మేడారం జాతరకు వీలు కల్పించుకొని వస్తే సంతోషంగా ఉంటుందని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also- Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?
Ministers Konda Surekha and Seethakka formally invited KCR to attend the Medaram Sammakka Saralamma Jatara pic.twitter.com/r6NIG3vKto
— Naveena (@TheNaveena) January 8, 2026

