కరీంనగర్ బ్యూరో స్వేచ్ఛః Minister Tummala Nageswara Rao: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టాలని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూర్ అపరేల్ ప్కార్‌లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(టెక్స్ పోర్ట్)యూనిట్ ను చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు మోడి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట ప్రభుత్వం పన్ను రూపంలో ఒక్క రూపాయి చెల్లిస్తే తిరిగి 30పైసలు మాత్రమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల అన్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న డబ్బులు ఎవ్వడి అబ్బసోమ్ము కాదని, ప్రజలు కట్టిన సోమ్ముతో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు రాష్ర్ట ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ఆర్ధిక వెసులుబాటు పోయినప్పటికీ రైతన్న, నేతల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. వర్కర్ టూ ఓనర్ కార్యక్రమాన్నిముఖ్యమంత్రికి వివరించి కార్యరూపం తీసుకువస్తామని మంత్రి హమీ ఇచ్చారు.
ఓర్వలేకనే తప్పుడు ప్రచారం మంత్రి శ్రీధర్ బాబు..
తెలంగాణలో జరుగుతున్న అభివద్దిని చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేతలు ఎచ్‌సీయూ భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పరిపాలనలో 10 ఏళ్ల విద్య రంగాన్నిపట్టించుకోలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్య కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీని బీఆర్‌ఎస్ పార్టీ పట్టించుకోలేదని అన్నారు.
Also Read: Telangana BJP: సన్నబియ్యం vs దొడ్డు బియ్యం.. బీజేపీకి ఎందుకంత బాధ?
తాను శాతవాహనకు ఒక లా కాలేజీతో పాటు ఒక ఇంజనీరింగ్ కళాశాల మంజూరి చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టెక్స్‌పోర్ట్ ప్రతినిధులతో మాట్లాడి 15 నెలల వ్యవధిలో కంపెనీ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ధమ్ముంటే కేంద్రంలో ఒప్పించి జీఎస్‌టీ తగ్గించు..
బండి సంజయ్‌కి పొన్నం సవాల్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం చేనేత వస్తువులపై వేసిన 18శాతం జీఎస్టీని తగ్గించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బండి సంజయ్‌కు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని దీనిపై ప్రధాన మంత్రి ఫోటోలు పెట్టాలని రాద్దతం చేస్తున్నారని పొన్నం అన్నారు.
దేశాన్ని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చేనేతపై పన్ను లేదని బీజేపీ మాత్రం జీఎస్టీ పేరుతో పన్నులు వసూల్లు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం ఇవ్వడం లేదని ప్రభాకర్ అన్నారు. వర్కర్ టూ ఓనర్ అనే పథకం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమని ఇప్పుడు ఈపథకాన్ని పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా చేస్తామని మంత్రి అన్నారు.
Also Read: Minister Seethaka: తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు..మంత్రి సీతక్క ఫైర్