Tummala Nageshwar Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Tummala Nageshwar Rao: రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageshwar Rao) ఆదేశించారు. రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. మండలానికి ఒకటి లేదా రెండు పీఏసీఎ(PACS)స్ మాత్రమే ఉన్న ప్రాంతాల్లో రైతు వేదికలను వాడుకొని గ్రామాల వారీగా, పాస్ పుస్తకాల ఆధారంగాపంపిణీ చేయాలన్నారు. ఒక రోజు ముందుగానే గ్రామాల వారీగా టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా

అధికారులతో సమీక్షించారు. ఎరువుల పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కోఆపరేటివ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్, విజిలెన్స్ విభాగాల పర్యవేక్షణతో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వచ్చే 20 రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుంచి కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయించడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు.

Also Read: Urea Shortage: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా మంటలు.. క్యూ లైన్ లలో మహిళా రైతులు

రాష్ట్రానికి 28,000 మెట్రిక్ టన్నుల యూరియా

శుక్రవారం రాష్ట్రానికి జీఎస్ఎఫ్సీ(GSFC), ఐపీఎల్(IPL), సీఐఎల్-కరాయికల్, సీఐఎల్ -కాకినాడ కంపెనీలతో 11,181 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలోని రైల్వే రేక్ పాయింట్లయిన కరీంనగర్(Karimnagar), మిర్యాలగూడ(Miryalguda), వరంగల్(warangal), పెద్దపల్లి ప్రాంతాలకు చేరిందని, శనివారం మరో 9,039 మెట్రిక్ టన్నులు ఎంఎఫ్ఎల్(MFL), క్రిబ్కో, సీఐఎల్ -క్రిష్ణపట్నం కంపెనీల నుంచి వరంగల్, సనత్ నగర్, కరీంనగర్ రైల్వే రేక్ పాయింట్లకు చేరనున్నాయని తెలిపారు. సెప్టెంబర్ లో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గతేడాది ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు.

Also Read: Niharika Konidela: సారీ అమ్మా! అంటూ నిహారిక పోస్ట్.. అల్లు శిరీష్ కామెంట్ వైరల్!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?