Minister Sridhar Babu: డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం
Minister Sridhar Babu( IMAGE ctredi: swetcha reporter)
Telangana News

Minister Sridhar Babu: డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం తీసుకుంటాం!

Minister Sridhar Babu: ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఈ-గవర్నెన్స్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ-గవర్నెన్స్, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో స్తోనియా రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో వచ్చిన వాణిజ్య ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని కోరారు.

 Also Read: GHMC Street Lights: స్ట్రీట్ లైట్లకు మెరుగైన నిర్వహణ…ఆరు జోన్లకు 12 వేల వీధి లైట్లు!

ఎస్తోనియా ప్రతినిధులకు సూచన

వాణిజ్యం, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలని, ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నామని అన్నారు. సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో తాము ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలని ఎస్తోనియా ప్రతినిధులకు సూచించారు. సెప్టెంబరులో ఎస్తోనియాను సందర్శించాలని మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సానుకూలంగా స్పందించారు. తమ అధికారుల బృందం ఎస్తోనియాను సందర్శిస్తుందని హామీ ఇచ్చారు.

 Alos Read: Keesara Man Arrested: గంజాయితో పట్టుబడి కటకటాల పాలైన వ్యక్తి.. చివరికి!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..