Seethaka on Harish Rao9image credit: twitter)
తెలంగాణ

Seethaka on Harish Rao: బహిరంగ లేఖలు రాయడం మాని ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి.. హ‌రీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్!

Seethaka on Harish Rao: అంగ‌న్వాడీ టీచ‌ర్ల జీతాల‌పై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన బహిరంగ లేఖపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మినీ అంగన్వాడీ టీచర్లపై బాధ్యత ఉంటే..ప‌దేళ్ల‌లో వారిని మెయిన్ అంగన్వాడీలుగా ఎందుకు ప‌దోన్న‌తులు క‌ల్పించ లేద‌ని హ‌రీష్ రావును ప్ర‌శ్నించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నిక‌ల ముందు మొక్కుబడి జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్న చ‌రిత్ర మీద‌ని మండిప‌డ్డారు.

ఆర్దిక మంత్రిగా ఉండి మిని అంగ‌న్వాడీల‌కు ప‌దోన్న‌తులు రాకుండా అన్యాయం చేసింది హ‌రీష్ రావేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పదేళ్లు మీకు ప‌ట్ట‌ని మినీ అంగన్వాడీల స‌మ‌స్య‌లు.. అధికారం పోగానే గుర్తుకు వ‌చ్చాయా? అని ప్ర‌శ్నించారు. ఓట్ల కోసమే అప్పట్లో జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. ఆ జీవోలు ఓట్ల జీవోలే.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా జారీ చేసిన జీవోలు పనికి రాకుండా పోయాయి.. ఇప్పుడు తాము జీవోల‌ను చట్టబద్ధంగా, పకడ్బందీగా అమలు చేసి చూపిస్తున్నాం అని మండిపడ్డారు.

Also Read: Admit Card – UPSC: అడ్మిట్ కార్డు లేకుంటే నో ఎంట్రీ.. 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష!

మీరు అంగ‌న్వాడీల‌ను మోసం చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే చట్టబద్ధంగా, ఆర్థిక శాఖ అనుమతులతో 3438 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించామ‌ని గుర్తు చేశారు. ఎన్నో చిక్కుముడుల‌ని చేదించి, భ‌విష్య‌త్తులో ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు త‌లెత్త‌కుండా..ఏప్రిల్ 2025లోనే ఈ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేసి, ఈ నెల నుంచే మెయిన్ అంగన్వాడీల తరహాలోనే మిని అంగ‌న్వాడీల‌కు జీతాలు చెల్లిస్తున్నామ‌న్నారు.

మిన్ సెంట‌ర్ల‌ను మెయిన్ సెంట‌ర్లుగా అప్ గ్రేడ్ చేసి..టీచ‌ర్లుకు తోడుగా హెల్పర్లను నియ‌మిస్తున్న‌ట్లు తెలిపారు.‘పదేళ్లు మీ పాలన వల్ల బాధపడ్డ ప్ర‌జ‌ల‌కు హ‌రీష్ రావు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చేబితే బాగుంటుంద‌న్నారు.. బహిరంగ లేఖ రాయడం కన్నా..అంతరాత్మను ప్రశ్నించుకోవాల‌ని సూచించారు.. అంగన్వాడీ వ్య‌వ‌స్థ‌ను బలోపేతం చేస్తూ, అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌ అభ్యున్నతికి పని చేస్తున్నాం.. పదేళ్ల మీ దుష్ప్రాచారపాలన పాపం ఒక్కరోజులో పోదు.. ద‌శాబ్ది కాల‌పు సమస్యల‌ను ఒక్కోక్క‌టిగా ప‌రిష్క‌రిస్తున్నాం’ అని సీతక్క స్ప‌ష్టం చేశారు.

Also Read: Telangana Police: మొబైల్​ ఫోన్ల రికవరీలో అగ్రస్థానం.. మరో ఘనత సాధించిన తెలంగాణ పోలీస్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!