Telangana Police:మరో ఘనత సాధించిన తెలంగాణ పోలీస్!
Telangana Police9 iamge credit: twitter)
Telangana News

Telangana Police: మొబైల్​ ఫోన్ల రికవరీలో అగ్రస్థానం.. మరో ఘనత సాధించిన తెలంగాణ పోలీస్!

Telangana Police: తెలంగాణ పోలీస్​ శాఖ మరో ఘనతను సాధించింది. పోలీసింగ్​ లో ఇప్పటికే దేశంలో అగ్రస్థానం…డ్రగ్స్​ కు చెక్​ పెట్టటంలో ప్రపంచంలోనే మొదటి స్థానం సాధించిన మన పోలీసులు తాజాగా మరో రికార్డ్​ సృష్టించారు. మొబైల్​ ఫోన్ల రికవరీలో దేశంలో నెంబర్​ వన్​ గా నిలిచారు. ఈ క్రమంలో నోడల్​ ఆఫీసర్​ గా ఉన్న సీఐడీ డీజీ షిఖా గోయల్​ ను డీజీపీ జితేందర్​ అభినందించారు. ఏయేటికాయేడు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ చోరీ కేసులు పెరిగిపోతుండటం…లక్షల మంది సెల్​ ఫోన్లను పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాటిని రికవరీ చేయటానికి కేంద్రం 2022, సెప్టెంబర్​ లో సీఈఐఆర్​ పోర్టల్​ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

టెలి కమ్యూనికేషన్స్ శాఖ సమన్వయంతో పైలట్​ ప్రాజెక్టుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని అమ​లు చేశారు. ఆ తరువాత 2023, ఏప్రిల్​ 19న తెలంగాణలో ఈ పోర్టల్​ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఐడీ డీజీ షిఖా గోయల్​ దీనికి నోడల్​ అధికారిగా ఉన్నారు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే మన వద్ద ఆలస్యంగా ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన పోలీసులు సెల్​ ఫోన్ల రికవరీలో రికార్డు సృష్టించారు. సీఈఐఆర్​ డ్యాష్​ బోర్డు గణాంకాల ప్రకారం ఈనెల 19వ తేదీ వరకు కోట్ల రూపాయల విలువ చేసే 78,114 మొబైల్​ ఫోన్లను రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోనే 30,963 సెల్​ ఫోన్లను రికవరీ చేశారు.

Also Read: Army Jawan Suicide: ఆర్మీ యువ జవాన్ ఆత్మహత్య.. కన్నీటి సంద్రంగా మారిన స్వగ్రామం!

సిబ్బంది అంకితభావం…
ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ షిఖా గోయల్​ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించటం వల్లనే ఈ ఘనతను సాధించగలిగినట్టు చెప్పారు. ప్రతీ ఫిర్యాదుపై కేసులు నమోదు చేయటం, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించటం, చోరీ అయిన, పోగొట్టుకున్న మొబైల్​ ఫోన్లు యాక్టివేట్​ కాగానే వాటికి ఫోన్లు చేసి మాట్లాడటం వంటి చర్యలు తీసుకోవటం వల్ల రికార్డు సృష్టించగలిగినట్టు తెలిపారు.

టెలికాం శాఖ సమన్వయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ పోలీస్​ సిటిజన్​ పోర్టల్​ దీంట్లో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. మొబైల్​ ఫోన్​ చోరీ అయినా, పోయినా వెంటనే www.tspolice.gov.in లేదా www.ceir.gov.in అన్న వెబ్​ సైట్లకు ఆన్​ లైన్​ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ల రికవరీలో విశేషంగా కృషి చేసిన సైబర్ క్రైం ఎస్పీ గంగారాం, డీడీజీ సెక్యూరిటీ హేమంత్​ రత్వే, సెక్యూరిటీ డైరెక్టర్​ నిఖిత, జేటీవో నంబి మృదుపాణిలను అభినందించారు.

Also Read: Notices to KCR: కాళేశ్వరం కమిషన్ దూకుడు.. కేసీఆర్‌కు నోటీసులు.. విచారణకు వెళ్తారా?

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!