Kaleshwaram Project: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను ఒక వైపు అమలు చేస్తూనే మరోవైపు ప్రజలు కావాలని గెలిపించుకున్న ఇందిరమ్మ ప్రజా పాలన ప్రభుత్వంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ… అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేటలో భూభారతి దరఖాస్తుల స్వీకరణకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు.
Also Read: AS Ravi Kumar Chowdary: సినీ పరిశ్రమలో మరో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి మృతి
ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ… రైతుల భూ సమస్యలను పరిష్కరించడమే హదమధ్యయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. భూభారతి చట్టంలో ప్రతి ఒక్క రైతు తమ భూ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన వెసులు బాటు కల్పించామని అన్నారు. మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరింప చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచి విద్యార్థుల పురోభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల ఖర్చుతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు.
Also Read: Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!
ఇంకా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రపంచంలోనే ఏడు వింతలే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఎనిమిదో వింతను ఆవిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్ తెలంగాణను నష్టాల ఊబిలోకి నెట్టేశారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే నన్నారు. మూడు టార్గెట్లు పెట్టుకొని రాష్ట్రాన్ని నష్టాల ఊబిలోకి నెట్టివేసి తన ఘనతను కేసీఆర్ చాటుకున్నారని విమర్శించారు.
Also Read: KCR Ghosh Panel Interrogation: విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్ అభ్యర్థన.. కమిషన్ కీలక నిర్ణయం!
లక్ష కోట్లకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించి దాని వంకతో దోచుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ పేరుతోను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతేకాకుండా పేదోళ్ల వ్యవసాయ భూములను లాక్కునేందుకే ధరణిని తీసుకొచ్చి మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మూడు టార్గెట్లు పెట్టుకొని తమకు కావాల్సినంత కెసిఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పింక్ కలర్ వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థను దోచుకున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ప్రజలకు సాక్షాదారాలతో నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు.