Nithiin Thammudu Trailer
ఎంటర్‌టైన్మెంట్

Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!

Thammudu Trailer: యంగ్ హీరో నితిన్ (Nithiin) కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, హిట్ మాత్రం ఆయనకు పడటం లేదు. టాప్ దర్శక, నిర్మాతలు కూడా ఆయనకు హిట్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాన్ని రూపొందించిన శ్రీరామ్ వేణు (Sriram Venu)ని ఆయన నమ్ముకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’ (Thammudu Movie). ఈ చిత్రంతో సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తుండగా.., వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 4న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్‌కు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చేలా ఈ సినిమా రూపొందుతుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది.

Also Read- Pawan kalyan: ఉస్తాద్ వంతు.. పవర్ స్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా!

ట్రైలర్ విషయానికి వస్తే.. కొత్తదనం నిండిన కథతో ఈ సినిమా రూపొందినట్లుగా ట్రైలర్‌లోని ప్రతి షాట్ తెలియజేస్తుంది. కథని పూర్తిగా రివీల్ చేయకుండా, ఉత్కంఠ రేకెత్తించేలా ట్రైలర్‌ని కట్ చేశారు. ముఖ్యంగా లయ వెర్షన్‌లో ఈ సినిమా ఉంటుందనే విషయాన్ని ట్రైలర్ చివరిలో వచ్చే డైలాగ్ తెలియజేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి వస్తున్న చిత్రం ‘తమ్ముడు’ అనే విషయాన్ని ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. నితిన్ ఈసారి ఓ మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమాను మలిచారనేది తెలుస్తుంది. ట్రైలర్ తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోతుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయనేది.. ఈ ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వావ్ అనేలా ఉన్నాయి.

Also Read- Jr NTR: ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ను ఎలా చూపించామంటే.. కాస్ట్యూమ్ డిజైనర్ ఎలివేషన్ అదుర్స్!

‘మీ అక్కను చూశావా.. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్‌ని లూస్ అవ్వలేదు’, ‘చేసిన తప్పు వల్ల ఆవిడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడా మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది. నిలబెడతా’, ‘ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు.. అదే వయలెన్స్‌తో చెప్తే..’, ‘మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. మాట బతికి మనిషిపోతే, మనిషి బతికున్నట్టే లెక్క’, ‘నువ్వెప్పటికీ ఆమెతో తమ్ముడు అనిపించుకోలేవు’.. ఇవి ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్. డైరెక్టర్ శ్రీరామ్ వేణు మరోసారి తన కలం బలాన్ని చూపించారు. కచ్చితంగా ఈ సినిమా నితిన్‌కు బంపర్ హిట్‌ని ఇచ్చి, మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తుందని భావించవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ విడుదలైన కొద్ది సేపట్లోనే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థతో హీరో నితిన్‌కు, అలాగే దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్‌లో హీరో నితిన్ ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాలు చేయగా.. దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ‘ఎంసీఏ’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?