jr NTR in War 2
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: ‘వార్ 2’లో ఎన్టీఆర్‌ను ఎలా చూపించామంటే.. కాస్ట్యూమ్ డిజైనర్ ఎలివేషన్ అదుర్స్!

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వార్ 2’ (War 2). ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్‌ వెళ్లి సినిమాలు తీశారు కానీ, ఒక్క ప్రభాస్ మినహా ఎవరూ అంతగా నిలదొక్కుకోలేక పోయారు. ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ చిత్రంతో డిజప్పాయింట్ చేశారు. ‘జంజీర్’ సినిమాతో రామ్ చరణ్ కూడా పరీక్షను ఎదుర్కొన్నాడు కానీ ఫెయిలయ్యాడు. ఇప్పుడు దాదాపు టాలీవుడ్‌లో చాలా వరకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్‌లో పరీక్ష రాస్తున్నాడు. ఆయన రిజల్ట్ ఎలా ఉంటుందో ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన టీజర్‌ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేలా చేసింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక తన కాస్ట్యూమ్స్‌కి, తన పనితనానికి వచ్చిన ప్రశంసలు, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్ 2’ కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఆశ్చర్యపోయారు.

Also Read- Gaddar Film Awards: ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’.. షీల్డ్ చూశారా!

దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గౌరవించబడే అనైతా ష్రాఫ్ అడజానియా (Anaita Shroff Adajania) ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘వార్ 2’లో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక్కసారి ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఎన్టీఆర్‌లో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందని నాకనిపించింది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై ఈ సినిమాలో అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా ఎన్టీఆర్‌ని ఇందులో చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు.

Also Read- Jr NTR: ఆ ఇద్దరి కూతుళ్ళకు ఎన్టీఆరే పెళ్లి చేశాడని చెప్పిన నటుడు అశోక్ కుమార్

స్టైలిస్ట్‌గా అనైతా ష్రాఫ్ అడజానియా ఇచ్చిన ఎలివేషన్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో బంపర్ హిట్ అందుకుంటారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్నోడికి ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే.. సక్సెస్ దానంతట అదే వస్తుందని వారు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’ చిత్రంలో కియారా అద్వానీ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?