Textile Unit In Sircilla: సిరిసిల్లలోని పెద్దూరు ఆపేరెల్ పార్కులో అత్యాధునిక దుస్తుల పరిశ్రమ శుక్రవారం ప్రారంభమవుతుంది. ఈ పరిశ్రమను 102కోట్లతో నిర్మాణం చేపట్టారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
సచివాలయం పరిశ్రమ ఏర్పాట్లపై గురువారం మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు అధికారులతో సమీక్షించారు. బీడీలు చుట్టే మహిళలు, పద్మశాలి సామాజిక వర్గం వారికి కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. బెంగళూరుకు చెందిన టెక్స్ పోర్ట్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
దుస్తులను ‘టెక్స్ పోర్ట్’ వంద శాతం ఎగుమతి చేస్తుందని, ఏటా రూ.300కోట్ల విలువైన దుస్తులను టామీ హిల్ఫిగర్, రాబర్ట్ గ్రాహం, వ్యాన్స్, మైఖేల్ కోర్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తుందని వెల్లడించారు.
Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?
ఏటా 70 లక్షల పీస్ లు తయారు అవుతాయని, ప్రస్తుతం వెయ్యి కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి రెండు షిఫ్టుల్లో 1600 మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. మరో 3 ఏళ్లలో ఇంకో 2000 కి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
పరిశ్రమలో ఉద్యోగాలు పొందిన మహిళలకు నియామక పత్రాలను మంత్రులు అందజేయనున్నారు. 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.62కోట్లతో టీజీఐఐసీ బిల్ట్ టు సూట్ యూనిట్ ను నిర్మించింది. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు