Minister Komati Reddy: ట్రాఫిక్ అవసరాల పై యాక్షన్ ప్లాన్ సిద్ధం
Minister Komati ReddyI(imagecredit:swetcha)
Telangana News

Minister Komati Reddy: ట్రాఫిక్ అవసరాల పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Minister Komati Reddy: రాబోయే 15 ఏండ్ల ట్రాఫిక్ అవసరాలను అంచనా వేసి సమగ్రమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అధికారులకు సూచించారు. ఇర్రంమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో విజన్ 2047పై గురువారం విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగతిలో ఆర్ అండ్ బీ కీలక భూమిక పోషిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి తీసుకెళ్లే బాధ్యత ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, ఇంజినీర్లపై ఉందని తెలిపారు.

రేడియల్ రోడ్లు

రెండేళ్లలో ఆర్ అండ్ బీ పరిధిలో కోటి చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టడం గర్వకారణమన్నారు. పలు బృహత్తర ప్రాజెక్టులు, హ్యామ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు(RRR), ఔటర్ రింగ్ (ORR)రోడ్డు నుంచి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్‌పోర్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని వెల్లడించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో ఆర్ అండ్ బీ శాఖ విజన్ డాక్యుమెంట్ వీడియో ప్రదర్శనను సిద్ధం చేయాలని సూచించారు.

Also Read: Tiger Protection: వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం.. టెక్నాలజీతో పులుల గొడవలకు చెక్..!

విజన్ డాక్యుమెంట్‌లో..

ఇప్పటివరకు చేసిన పనులు, భవిష్యత్ ప్రాజెక్టులు, మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ-బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాజెక్టులన్నీ విజన్ డాక్యుమెంట్‌లో సమగ్రంగా పొందుపరచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి, ఆర్డీసీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, ఎన్ హెచ్ఏఐ రీజినల్ అధికారి శివశంకర్, ఆర్ అండ్ బీ సీఈలు శ్రీనివాస్ రెడ్డి, బీవీ రావు, లింగారెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: TANA: పాల్వంచ విద్యార్థినికి తానా గుర్తింపు.. వర్చువల్ బాలరచయితల సమ్మేళనానికి ఆహ్వానం

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!