Minister Bhatti Vikramarka: బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణను జనాల్లోకి తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పథకాలకు మంచి పేరు ఉన్నదన్నారు. అనేక సంక్షేమ పథకాల అమలు భేష్ గా ఉన్నదన్నారు. కాంగ్రెస్ తో మంచి జరుగుతుందని స్వయంగా లబ్ధిదారులు చెప్తున్నారని వెల్లడించారు.
రూ. 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, 56 వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.8 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం, సన్న ధాన్యంకు రూ. 500ల బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లెక్కలేనని పథకాలను సంపూర్ణంగా అమలు చేశామన్నారు.
MP Kishan Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీలో దుమారం.. ఇన్‌చార్జ్ ఎవరు? బీజేపీలో తర్జన భర్జన!
సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశామన్నారు. ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే పూర్తి చేయలేకపోయారని, కానీ ప్రభుత్వం దీరోదాత్తంగా చెప్పిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ రెండు అంశాలు చేయాలని డిమాండ్ నెలకొన్నదన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఎస్సీ కుల వర్గీకరణ జరిగిందన్నారు.
దేశంలో కొద్ది మందికి ఇష్టం లేకపోయినా.. భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిందన్నారు. అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగిందన్నారు.బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ ఎస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలను మూట కట్టి మూలన పడేశాయన్నారు.
ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కావున చేతులు ఎత్తేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు