Stree Summit 2.0: మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కోసం పలు పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాల కోసం 21వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, సిటీ పోలీస్ కలిసి నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
మహిళా సాధికారికత గోల్ కాదని చేరుకోవాల్సిన గమ్యం అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హిందూ కోర్టు బిల్లు ద్వారా మహిళలకు విశేష హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే మహిళా స్వయం సహాయక బృందాలకు నిధులను అందచేస్తున్నట్టు తెలిపారు.
Aslo Read: CM Revanth Reddy: సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్ హోటల్‌లో కలకలం
ఇలా ఆర్థిక సాయం పొందుతున్న స్వయం సహాయక బృందాలు పలు రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. వాటికి ప్రభుత్వమే మార్కెట్ ను క్రియేట్ చేస్తోందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి దిశగా మహిళలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇలా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ప్రభుత్వమే బై బ్యాక్ గ్యారంటీ ద్వారా కొంటుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ మాట్లాడుతూ ఇళ్ల్లల్లో, పని చేసే చోట మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షతను పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలు వద్దనుకోవటం బాధాకరమని చెప్పారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. పోలీసు శాఖలో చేరుతున్న మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. మహిళలకు సాధికారికత కల్పించినపుడే జాతీయ జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.
Also Read: TG on SDRF: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ. 4 లక్షల సాయం అందించేందుకు రెడీ..
కార్యక్రమానికి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్, కాయతీ నర్వానే, వనిత దత్త, నమిత బంకా, జెన్నీఫర్ లార్సన్, ఐఏఎస్ అధికారిని దివ్య దేవరాజన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు