Mexican President (imagecredit:twitter)
జాతీయం, తెలంగాణ

Mexican President: మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా పై లైంగిక వేధింపులు

Mexican President: మెక్సికో నూతన అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌(Claudia Sheinbaum)కు బహిరంగ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం జరిగిన బహిరంగ సభలో ప్రజలతో కలుస్తున్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమెను తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన సమయంలో, అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అయినప్పటికీ క్లాడియాను ఆ వ్యక్తి అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ, అతడి చేతిని పక్కకు నెట్టిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు(Photose), వీడియోలు(Videos) సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, అధ్యక్షురాలు షైన్‌బామ్ ప్రజల వద్దకు వెళ్లి, వారితో కరచాలనం చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. భద్రతా వలయాన్ని దాటి వచ్చిన ఆ వ్యక్తి అకస్మాత్తుగా అధ్యక్షురాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. క్లాడియా భద్రతా బృందం ప్రతిస్పందనపై ప్రజలు, మీడియా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

Also Read: Jr NTR weight loss: ఎన్టీఆర్ వెయిట్ లాస్‌కి కారణం ఇదేనా.. ప్రతిసారీ ఎందుకిలా..

మహిళా నాయకుల భద్రత..

దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న ఒక మహిళా నాయకురాలికి బహిరంగంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు భద్రతా సిబ్బంది మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన మెక్సికోలో మహిళా నాయకుల భద్రత, అలాగే బహిరంగ కార్యక్రమాలలో వీవీఐపీ భద్రతా ఏర్పాట్లపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ ఘటనపై అధ్యక్షురాలు, ఆమె కార్యాలయం నుంచి తక్షణమే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read: Purushaha First Look: ‘పురుషః’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది చూశారా.. ఇదేదో వెరైటీగా ఉందే..

Just In

01

Anunay Sood death: లాస్ వేగాస్‌లో ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి..

Private Colleges: సర్కార్‌కు ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. డబ్బు చెల్లించాలని డిమాండ్.. లేదంటే..?

AUS vs IND 4th T20I: కాసేపట్లో భారత్-ఆసీస్ నాల్గో టీ20.. ఇరు జట్లలో కీలక మార్పులు.. ఎవరు గెలుస్తారంటే?

Kaantha trailer: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా మరి..

Minister Ponguleti: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి సంచలనం.. ఎమన్నారంటే..!