Jr NTR weight loss: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. తాజాగా అక్కినేని నాగార్జున ‘శివ’ రీ రిలీజ్ గురించి ఆయన చేసిన ప్రమోషన్ వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్ మునుపటికన్నా చాల సన్నగా కనిపించారు. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమా కెరీర్ మొదటి నుంచీ ఎన్టీఆర్ ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే వచ్చారు. ఒక్క సారిగా బరువు తగ్గడం, పెరగడం ఆయనకు సర్వ సాధారణమే. కానీ సడన్ గా చూసిన ఫ్యాన్స్ భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీనిపై ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు కానీ ఇదంతా సినిమా కోసమే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Read also-Baahubali Eternal War teaser: ‘బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1’ యానిమేషన్ టీజర్ వచ్చేసింది చూశారా..
ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కొత్తేమీ కాదు. ‘యమదొంగ’ సినిమా కోసం ఆయన బరువు తగ్గి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ‘టెంపర్’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాల కోసం కూడా తన శరీరాకృతిని మార్చుకున్నారు. తాజా సమాచారం మీడియా కథనాల ప్రకారం, ఎన్టీఆర్ ఈ వెయిట్ లాస్ ను తన తదుపరి పెద్ద ప్రాజెక్టు డ్రాగన్ కోసం చేపట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమా’డ్రాగన్’, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రాల కోసం ఆయన ప్రత్యేకమైన ఫిట్‌నెస్ నియమావళిని అనుసరిస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ వ్యక్తిగత ఫిట్‌నెస్ కోచ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదని, పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని మలచుకునే ప్రక్రియలో భాగమని ఆయన తెలిపారు.
Read also-first Telugu talkie: తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే?
దీంతో కొంత మంది అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం, బరువు తగ్గడానికి ‘ఒజెంపిక్’ వంటి మందులు వాడుతున్నారనే పుకార్లు రావడానికి చెక్ పడింది. ఈ మార్పు కేవలం నిరంతర కృషి, కఠినమైన డైట్, తీవ్రమైన వర్కవుట్స్ ఫలితమే అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని నివేదికల ప్రకారం, ఆయన కొద్ది నెలల్లోనే 18 కిలోల వరకు బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి, జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా ఆయన సినిమా పాత్రల డిమాండ్ మేరకే అని స్పష్టమవుతోంది. తన పాత్రల కోసం ఆయన చూపే ఈ అంకితభావం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇలాంటి విషయాల్లో ఎన్టీఆర్ స్వయంగా వచ్చి రూమర్స్ కు చెక్ పెడితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రానున్న కాలంలో ఆయన మరిన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తారో అనేది వేచి చూడాల్సిందే.
