Mettu Sai Kumar: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీశ్ రావు, కేటీఆర్ లకు రాబోయే బిగ్ బాస్ సీజన్ 10లో చోటు కల్పించాలంటూ నటుడు నాగార్జునకు లేఖ రాశారు. కాంగ్రెస్ నేత, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ మెట్టు సాయికుమార్ ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ లు రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారని.. అబద్దాలు మోసం ఆడటంలో దిట్ట అంటూ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ఏముందంటే?
నటుడు నాగార్జునకు రాసిన లేఖలో హరీశ్ రావు, కేటీఆర్ లపై ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ మెట్టు సాయి కుమార్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బిల్లా, రంగాలుగా వారిద్దరిని అభివర్ణించారు. ‘బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున గారికి నమస్కారం. మీ టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయే చక్కటి ఐడియా. బిగ్ బాస్ సీజన్ 10లో బిల్లా, రంగాలుగా పేరున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికే వీరిద్దరూ రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. అబద్దాలు చెప్పడంలో రికార్డులను బద్దలు కొట్టారు’ అంటూ లేఖలో పేర్కొన్నారు.
బిగ్ బాస్ సీజన్-10 లో హరీష్ రావు, కేటీఆర్ లకు అవకాశం ఇవ్వాలని కోరుతూ నాగార్జునకు లేఖ రాసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
వీరిద్దరూ రాజకీయ నటులుగా పేరుప్రఖ్యాతలు సాధించారు
అబద్దాలు చెప్పడం, మోసం చేయడంలో వీరికి వీరే సాటి వీరికి వీరే పోటీ
ఆస్కార్ అవార్డుని… pic.twitter.com/kTe4hj5bec
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025
Also Read: Man Married Thrice: కంత్రి భర్త.. మూడేళ్లలో ముగ్గురిని పెళ్లాడాడు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్యలు
‘మోసాల్లో గిన్నీస్ రికార్డు’
తెలంగాణ ప్రజలను మోసం చేసి హరీశ్ రావు, కేటీఆర్ లు గిన్నీస్ రికార్డులకెక్కారని లేఖలో ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ ఆరోపించారు. నటనకు నాట్యం నేర్పిన వారు. నవరసాలు పండించడంలో వీరికి వీరే సాటి. ఆస్కార్ ను సైతం ఆశ్చర్య పరిచే నటన వీరిది. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాపం వీరి సొంతం. ఇలాంటి చక్కటి నటులను బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలకు మంచి వినోదం దొరుకుతుంది. మీ టీఆర్పీ రేటింగ్స్ కూడా అమాంతం పెరుగుతాయి’ అంటూ మెట్టు సాయికుమార్ నాగార్జునకు రాసిన లేఖలో రాసుకొచ్చారు.

