Telangana Rains (Image Source: AI)
తెలంగాణ

Telangana Rains: ఇదేం క్లైమేట్ భయ్యా.. పగలు ఎండ, రాత్రి వాన.. వచ్చే 3 రోజులు మాత్రం!

Telangana Rains: తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉదయం అంతా ఎండ , సాయంత్రం ఈదురుగాలుల తో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో నేటి నుంచి మూడ్రోజులు పలు జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ద్రోణి ప్రభావంతో..
మరాత్వాడ నుండి కర్ణాటక – తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి నెలకొని ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొంది. దాని ఫలితంగా ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

ఆ జిల్లాల్లో వర్షం..
ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వాన కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.

రేపు వాన ఎక్కడంటే?
రేపు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందిన వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ సమయంలో గంటకు 40-50 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు కామారెడ్డి జిల్లాలలో రేపు వర్షం పడే అవకాశముంది.

Also Read: Salman Khan: ఇక్కడ వద్దు.. పాకిస్థాన్ వెళ్లిపో.. సల్మాన్‌పై మండిపడుతున్న నెటిజన్లు!

అక్కడి వారికి గుడ్ న్యూస్
పైన సూచించిన జిల్లాలతో పాటు రేపు, ఎల్లుండి మరికొన్ని ఏరియాల్లోనూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయనపేట మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వాన కురవనుంది.

Also Read This: Operation Sindoor: ప్రధాని అత్యవసర భేటి.. భారత వైమానిక దళం సంచలన ప్రకటన!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు