Salman Khan: బాలీవుడ్ బడా హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే బాలీవుడ్ ప్రేక్షకులు పిచ్చెక్కిపోతుంటారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. అయితే ఎప్పుడు వివాదాల్లో మునిగి తేలుతూ ఉండే సల్మాన్.. తాజాగా మరో సమస్య కొని తెచ్చుకున్నారు. భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సల్మాన్ చేసిన ట్వీట్.. నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు సల్మాన్ చేసిన ట్వీట్ ఏంటి? ఆయన్ను నెటిజన్ను ఎందుకు ఏకిపారేస్తున్నారు? ఇప్పుడు చూద్దాం.
సల్మాన్ పెట్టిన ట్వీట్ ఇదే
భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు శనివారం సాయంత్రం మన విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నటుడు సల్మాన్.. ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘సీజ్ ఫైర్ కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది.
ఎవరికోసం ట్వీట్?
ప్రస్తుతం దాడి పరంగా చూస్తే భారత్ దే పైచేయిగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ కు సల్మాన్ థ్యాంక్స్ చెప్పడంపై నెటిజన్లు ద్వంద్వ అర్థాలు తీస్తున్నారు. పాకిస్థాన్ తరపున సల్మాన్ ధన్యవాదాలు తెలిపినట్లు ఉందని ఆరోపిస్తున్నారు. పాక్ సానుభూతిపరుడిగా సల్మాన్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
అప్పుడు మౌనం ఎందుకు?
అయితే పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఒక్క పోస్ట్ కూడా సల్మాన్ వేయకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయకుండా సీజ్ ఫైర్ అని తెలియగానే పోస్ట్ పెట్టడం వెనక అర్థమేంటని నిలదీస్తున్నారు. పాక్ పై అంతగా సానుభూతి ఉంటే అక్కడికే వెళ్లిపోవాలని ఫైర్ అవుతున్నారు. మరోవైపు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో సల్మాన్ తన పోస్ట్ ను డిలీట్ చేయడం గమనార్హం.
Also Read: Operation Sindoor: ప్రధాని అత్యవసర భేటి.. భారత వైమానిక దళం సంచలన ప్రకటన!
రంగంలోకి ఫ్యాన్స్!
సల్మాన్ ను నెటిజన్లు ఏకిపారేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ రంగంలోకి లోకి దిగారు. తమ అభిమాన హీరోకు మద్దతు ఇస్తున్నారు. గతంలో పాక్ కు వ్యతిరేకంగా సల్మాన్ మాట్లాడిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అలాగే తమ హీరో మంచి మనసు ఇదంటూ సల్మాన్ చేసిన దాన ధర్మాలకు సంబంధించిన పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. మెుత్తం మీద సీజ్ ఫైర్ పై సల్మాన్ చేసిన పోస్ట్.. సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇదిలా ఉంటే గతంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన కామెంట్స్ కూడా తాజాగా వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిపల్లవిని సైతం నెటిజన్లు విమర్శిస్తున్నారు.