Meenakshi Natarajan: హైదరాబాద్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. పీసీసీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక నుండి ప్రతి 2 నెలలకు ఒక్కసారి పీసీసీ సమావేశాలు నిర్వహించుకుందామని అన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా వివిధ జిల్లాలోనూ పీసీసీ భేటీలు నిర్వహించుకుందామని చెప్పారు. దీని ద్వారా అక్కడి నేతలకు, కార్యకర్తలకు మరింత చేరువ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
‘ఎవరొచ్చిన స్వాగతిస్తాం’
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి లేవని.. తెరిచే ఉన్నాయని మీనాక్షి నాటరాజన్ అన్నారు. ఎవరు వచ్చిన స్వాగతిస్తామని చెప్పారు. అయితే పార్టీలో ఏళ్ల నుండి ఉన్నవారికి తొలి ప్రాథాన్యం ఉంటుందని మీనాక్షి స్పష్టం చేశారు. 20 శాతం వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన వారికీ అవకాశం కల్పిస్తామమని అన్నారు.
వారంలో లిస్ట్ విడుదల
బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందని ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జిల్లా, మండల, గ్రామాల పూర్తి లిస్ట్ పీసీసీ వద్ద ఉందని పేర్కొన్నారు. వారంలో లిస్ట్ ను అప్రూవ్ చేస్తామని చెప్పారు. ‘కొన్ని చోట్ల పేర్లు రావాల్సి ఉంది అవి చూసుకొని లిస్ట్ విడుదల చేస్తాము. ఈ నెల 15 తర్వాత గాంధీ భవన్ లోనే ఒరియేంటేషన్ కార్యక్రమం ఉంటుంది’ అని చెప్పారు.
‘అలా చేయకుంటే నష్టం’
మరోవైపు టీపీసీసీ చీఫ్ గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు మీనాక్షి నటరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణలో సామాజిక న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వేర్లు కార్యకర్తలు.. దృఢంగా ఉండాలి. అందరూ కలసికట్టుగా శ్రమించాలి. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికనే ఎన్నికలు. 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళకుంటే పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉంది’ అని అన్నారు.
Also Read: Weight Loss Challenge: కొవ్వు కరిగించుకో.. రూ.లక్షల్లో బోనస్ దక్కించుకో.. ఉద్యోగులకు బంపరాఫర్!
కామారెడ్డి డిక్లరేషన్ పై..
ఓటు చోరీ పై కేంద్ర వైఖరిని ఎండగట్టాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని క్షేత్ర స్థాయిలో గ్రామ, మండల జిల్లా స్థాయి లో ప్రచారం చెయ్యాలి. మూడు పాదయాత్రలు పెండింగ్ లు ఉన్నాయి. ఈ నెలల్లో పాదయాత్ర షురూ అవుతుంది. తెలంగాణ ఇప్పటి వరకు పూర్తి చేసిన పాదయాత్ర విజయవంతం అయ్యింది. 15న కామారెడ్డిలో జరిగే సభను విజయవంతం చెయ్యాలి. కామారెడ్డిలో సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలి. కామారెడ్డిలో నుండే డిక్లరేషన్ జరిగింది. ఆదివాసీ గిరిజన ప్రాంత ప్రజలతో మమేకేం అయ్యే అవకాశం నాకు దక్కింది. నా స్థానం వరకు ఆదివాసీ నేతలు ఎదగాలి. గతంలో డీసీసీ కార్యాలయాలకు కేటాయించిన భూములు ఉంటే వాటి వివరాలు ఇవ్వాలి’ అని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు.