Medaram Maha Jatara 2026: మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలను నమస్కరించుకొని మెుక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు జంపన్న వాగులో భక్తుల తాకిడి పెరిగింది. వేలాది మంది భక్తులు వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన..
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం మహాజాతర ప్రారంభం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. లక్షలాదిగా తరలిస్తున్న వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బైక్ పై తిరుగుతూ పర్యవేక్షించారు. మంత్రులతో పాటు జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ తదితర అధికారులు పరిశీలించారు. మేడారం జంపన్న వాగు, పరిసర ప్రాంతాల వద్ద పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జన సంద్రమైన మేడారం
పెద్దఎత్తున తరలివచ్చి వన దేవతలను దర్శించుకుంటున్న భక్తులు
ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు
నేడు గద్దెపైకి సమ్మక్క ఆగమనం
చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్న పూజారులు
గాలిలో… pic.twitter.com/LfwM4X8LDv
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
జాతర ఏర్పాట్లను బైక్‌లపై పరిశీలించిన మంత్రులు పొంగులేటి, అడ్లూరి
గురువారం ఉదయం మేడారం జాతర ఏర్పాట్లను బైక్‌లపై పరిశీలించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రులు… pic.twitter.com/F5ohtGJIcb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
అర్ధరాత్రి గద్దెపైకి చేరిన సారలమ్మ..
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. అటు కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల ప్రతిమను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారులు ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7 గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరి జంపన్న వాగు మీదుగా రాత్రి 12.30 గంటలకు మేడారం గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు.
Also Read: Ramchander Rao: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం.. అన్ని మున్సిపాలిటీలకు పోటీ చేస్తున్నాం.. బీజేపీ నేత రాంచందర్ రావు!
నేడు గద్దె పైకి సమ్మక్క..
మరోవైపు ఇవాళ మేడారంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో పాటు మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఈ పవిత్రమైన కార్యాన్ని నిర్వర్తించనున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ అనంతరం మరింత రద్దీ పెరిగే అవకాశముంది. మరోవైపు రద్దీని తట్టుకునేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

