Ramchander Rao: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని,రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు పోటీ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు న్యాయవాదులు, మార్వాడీ సామాజికవర్గ నేతలు బీజేపీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ది 40 శాతం కమీషన్ల ప్రభుత్వం
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీలు రాష్ట్రాన్ని లూటీ చేశాయని, ప్రజలను నిలువునా మోసం చేశాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడానికి ఏం లేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ది 40 శాతం కమీషన్ల ప్రభుత్వమని, కాంట్రాక్టర్ల ప్రభుత్వమని మండిపడ్డారు. పoపకాల కోసం మంత్రులు బజారుకెకుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిల ప్రభుత్వంగా మారిందని చురకలంటించారు. సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తామని రాంచందర్ రావు స్పష్టంచేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం
ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్, రేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్నికల ఇన్చార్జ్ అశీష్ షెలార్, రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కో-ఇన్చార్జ్ అశోక్ పర్ణామి, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర డిప్యూటి సీఎం అజిత్ పవార్ మృతిపై రాంచందర్ రావు శ్రద్ధాంజలి ఘటించారు. విమాన ప్రమాద వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
Also Read: Ramchander Rao: నైనీ టెండర్ల రద్దు వెనుక అసలు రహస్యం అదే.. బీజేపీ నేత రాంచందర్ రావు!

