Transco-DE (Image source Swetcha Daily)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Medak Bribe Case: రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాన్స్‌కో డీఈ..

Medak Bribe Case: పౌల్ట్రీ రైతు నుంచి రూ.21,000 వేలు లంచం డిమాండ్

నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మెదక్ ట్రాన్స్‌కో డీఈ షేక్ చాంద్ షరీఫ్ బాషా

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: సింగల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి పౌల్ట్రీ ఫామ్ రైతు నుంచి ఏకంగా రూ.21 వేలు లంచం తీసుకుంటూ మెదక్ ట్రాన్స్‌కో (డీఈ) షేక్ చాంద్ షరీఫ్ భాషా పట్టుబడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్, తన సిబ్బందితో కలిసి ట్రాన్స్‌కో   డివిజనల్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా నిందిత అధికారిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 27న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన పాపన్నగారి భాస్కర్ అనే రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి డబ్బులు కావాలంటూ డీఈ డిమాండ్ చేశాడు.

ఈ విషయాన్ని సదరు రైతు ఏసీబీ దృష్టికి తీసుకెళ్లాడు. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన పాపన్నగారి భాస్కర్ అనే బాధిత రైతు అధికారులకు అన్ని వివరాలు వెల్లడించాడు. దీంతో, విచారణ చేపట్టగా.. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి మొత్తం రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ.9,000 ప్రైవేట్ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా చెల్లించాడని, మిగతా రూ.21,000 ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేస్తానంటూ డీఈ చెప్పినట్టు బాధిత రైతు పేర్కొన్నాడు. ఆ నగదు గురువారం డీఈకి కి ఇస్తుండగా ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

Read Also- Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

కాగా, రైతు భాస్కర్ రూ.18 లక్షల బ్యాంకు రుణం తీసుకొని నూతనంగా పౌల్ట్రీ ఫామ్ నిర్మిస్తున్నాడు. అందులో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ అవసరం ఉండడంతో పాపన్నపేట ఏఈని సంప్రదించాడు. లక్షా పదివేల రూపాయలతో నూతన ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వలేదని రెండు లక్షల పంతొమ్మిది వేలకు పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానిని తగ్గించడానికి ట్రాన్స్‌కో డీఈకి 50 వేల రూపాయలు ఇవ్వాలని పాపన్నపేట ఏఈ చెప్పాడని బాధితుడు భాస్కర్ తెలిపాడు.

అందులో భాగంగా 30000 రూపాయలు ఇచ్చానని, అందులో 9000 రూపాయలు ఓ వ్యక్తికి ఫోన్ పే చేయగా మిగతా 21,000 రూపాయలు గురువారం నేరుగా డీఈ షేక్ చాంద్ షరీఫ్ బాషాకు ఇస్తుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు విషయంపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో ఫోన్ చేయిస్తే, నాకెందుకు ఫోన్ చేయిస్తున్నావని, అతను వచ్చి ఇక్కడి వర్క్ చేస్తాడా? ఎమ్మెల్యే ఏం చేస్తాడు?, ఎమ్మెల్యే పీఏ, ఏం చేస్తాడని దురుసుగా మాట్లాడడని బాధితుడు భాస్కర్ పేర్కొన్నాడు. విచారణ అనంతరం డీఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు.

Read Also- Azharuddin: రేపే కేబినెట్‌లోకి అజారుద్దీన్.. టైమ్ కూడా ఫిక్స్.. మంత్రులకు అందిన ఆహ్వానం

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు