Azharuddin (Image Source: Twitter)
తెలంగాణ

Azharuddin: రేపే కేబినెట్‌లోకి అజారుద్దీన్.. టైమ్ కూడా ఫిక్స్.. మంత్రులకు అందిన ఆహ్వానం

Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. రేపు తెలంగాణ మంత్రిగా ప్రమాణం స్వీకరం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గం.లకు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక అహ్వానం సైతం వెళ్లింది. అయితే అజారుద్దీన్ ను కేబినేట్ లోకి చేర్చుకోవడంపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ప్రభుత్వం టైమ్ ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఏ శాఖ ఇస్తారంటే?

తెలంగాణ కేబినేట్ లో ప్రస్తుతం మైనారిటీల తరపున ఒక్క మంత్రి లేరు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ను తీసుకోని ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరో శాఖను సైతం కట్టబెట్టే అవకాశం మెండుగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చే అంశం.. బుధవారమే తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఆశించిన ఆయనకు.. ఏకంగా కేబినేట్ ర్యాంక్ పదవిని కాంగ్రెస్ కట్టబెడుతుండటం విశేషం.

Also Read: YS Sharmila: మెుంథాతో ఏపీకి అపార నష్టం.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్రాన్ని షర్మిల డిమాండ్

కాంగ్రెస్ వ్యూహాం?

జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అజారుద్దీన్ కు కేబినేట్ లో చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంకును ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుకున్న ముఖ్య ఉద్దేశమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పైగా అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం.. గతంలో అక్కడి నుంచి పోటీ చేసి 64 వేల ఓట్ల వరకూ సాధించడం తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవడంపై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్

ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవడంపై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీనిని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డ్యామేజ్ అయ్యిందని, అందుకే, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటూ గులాబీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గంవారు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం లేదంటూ సర్వే రిపోర్టులు అందడంతో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది.

Also Read: Pawan Kalyan: ఏపీలో భారీగా పంట నష్టం.. పొలంబాట పట్టిన పవన్ కళ్యాణ్.. రైతన్నల కష్టంపై ఆరా!

Just In

01

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?

Akhanda 2: సర్వేపల్లి సిస్టర్స్.. థమన్ అసలు ఏం చేస్తున్నావయ్యా?