Pawan Kalyan (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: ఏపీలో భారీగా పంట నష్టం.. పొలంబాట పట్టిన పవన్ కళ్యాణ్.. రైతన్నల కష్టంపై ఆరా!

Pawan Kalyan: మెుంథా తుపాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంత జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యంత వేగంగా వీచిన ఈదురుగాలులకు, భారీ వర్షం తోడవడంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వయంగా రంగంలోకి దిగారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం (Avanigadda Assembly constituency)లోని గ్రామాల్లో పర్యటించారు.

రైతులకు భరోసా

అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం (Koduru Manadal) కృష్ణాపురం గ్రామం (Krishnapuram Village)లో దెబ్బతిన్న పంటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటమునిగిన వరిచేనులోకి దిగి.. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు పవన్ చెప్పారు. కాగా ఈ పర్యటనలో పవన్ తో పాటు మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Jubilee Hills By Election: ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ముందుకు.. భవిష్యత్ అవసరాలను గుర్తు చేస్తూ ఇంటింటికీ కాంగ్రెస్!

మోపిదేవీ ఆలయంలో పూజలు

అనంతరం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని (Mopidevi Subrahmanyeswar Swamy Temple) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు.. వేద మంత్రాలతో పవన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. మెుంథా తుపాను (Cyclone Montha) నష్టం నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

Also Read: Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

చిరువ్యాపారుల పలకరింపు

మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గంలోని చిరు వ్యాపారులను పవన్ పలకరించారు. వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. కాగా పవన్ తో ఫొటో దిగేందుకు చిరు వ్యాపారులు పోటీపడ్డారు. పవన్ వారితో ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జనసేన శతాఘ్ని టీమ్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు