Damodar Rajanarsimha (imagecredit:swetcha)
తెలంగాణ

Damodar Rajanarsimha: పూర్తయిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి..!

Damodar Rajanarsimha: డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్పిటళ్లు కలకలలాడుతున్నాయని, పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్‌‌–2) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు.

పోస్టులకు ఎంపికైన వారు

ప్రభుత్వ హాస్పిటళ్లలోని 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా, 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23,323 మంది బోర్డు నిర్వహించిన పరీక్షకు (కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌) హాజరయ్యారు. వీరిలో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధం చేయగా, సెక్రటేరియట్‌లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర అధికారులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఆ జాబితాను విడుదల చేశారు. అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వారు సాధించిన మార్కుల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అధికారులు అప్‌లోడ్ చేశారు.

Also Read: Huzurabad News: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై వివక్ష.. బెదిరింపు ఆరోపణలు

మరో 7 వేలకుపైగా పోస్టులు

ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు, ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గోపికాంత్ రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ లు ఉన్నారు.

Also Read: OnePlus 15R Launch: ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న OnePlus 15R.. ఫీచర్లు ఇవే!

Just In

01

SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?

Hydraa: హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 52 ఫిర్యాదులు.. వీటిలో ఎక్కువ ఫిర్యాధులు వాటిపైనే..!

Madhuyashki Goud: ఆదివాసీ గిరిజన యువత పై మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాక్యలు..?

Damodar Rajanarsimha: పూర్తయిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి..!

Konda Surekha: భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కల్యాణం