Panchayat Elections: తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరుగనున్నది. తొలి విడుతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా, 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 37,440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డ్ స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67,893 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల సంఘం సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ, వార్డు సభ్యుడి బ్యాలెట్ తెలుపు రంగులో ఉండి అందులో గుర్తులను ముద్రించారు. తొలి విడుతలో 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూగబోయిన మైకులు
మొదటి విడుత జరిగే గ్రామాల్లో వారం రోజుల పాటు అభ్యర్థులు విస్తృత ప్రచారం చేశారు. ప్రచార రథాలతో తమకు కేటాయించిన గుర్తులతో ప్రతి వీధిలో ప్రచారం చేయించారు. అంతేకాదు పార్టీల వారీగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లారు. కేటాయించిన గుర్తులు చూపుతూ ఓటు వేయాలని అభ్యర్ధించారు. మైకులు ప్రచారంతో హోరెత్తిన పల్లెలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. ఇక పోలింగ్‌కు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వార్డులు, కాలనీల వారీగా బాధ్యులను నియమించి ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. రాత్రివేళ మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి బస్సు చార్జీలు ఇస్తున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలను పంపించి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం 10 మందికి ఒకరి చొప్పున ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు సమాచారం.
Also Read: Khammam Collectorate: ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో.. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
మూడో విడుత నామినేషన్ల ఉపసంహరణ
మూడో విడుత నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగిసింది. ఎంతమంది ఉపసంహరించుకున్నారు? ఎంతమంది బరిలో ఉన్నారనేది తేలిపోయింది. అయితే, పార్టీ కార్యకర్తలుగా పని చేసిన వారే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడంతో వారిని బుజ్జగించడంలో పలువురు సక్సెస్ అయ్యారు. కొన్ని గ్రామాల్లో మాత్రం ససేమీరా అన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచారం చేపడుతున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
Also Read: Bomb Threat: సీఎంవోకు బాంబు బెదిరింపు.. పోలీసులను టెన్షన్ పెట్టిస్తున్న ఆకతాయిలు

