Khammam Collectorate: ఖమ్మం జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను జిల్లా కలెక్టర్లు అద్వైత్ కుమార్ సింగ్, (Advait Kumar Singh) అనుదీప్ ఆవిష్కరించారు. 10 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్‌మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాలను మహబూబాబాద్, ఖమ్మం కలెక్టర్లు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, ఆర్అండ్బి ఈఈ భీమ్లా నాయక్, జిల్లా అధికారులు, పరిపాలన అధికారి పవన్ కుమార్, కలెక్టరేట్ అన్ని విభాగాల సిబ్బంది, ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Hyderabad Tragedy: బండ్లగూడలో మరో విషాదం.. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్
సోనియా గాంధీ కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగింది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించనిదగిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ అన్నారు.జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, శాసనమండలి మాజి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షులు మహ్మద్ జావేద్, రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకులు వడ్డేబోయిన నరసింహారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్తా సీతారాములు, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ గౌస్, నగర ఐ యన్ టి యు సి అద్యక్షులు నరాల నరేష్ నాయుడు, షేక్ అబ్బాస్ బేగ్, పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
Also Read: Leopard Spotted: గద్వాల జిల్లాలో చిరుత సంచారం కలకలం

